Rahu Planet: రాహువు ఈ రాశుల వారిని ఎల్లప్పుడూ కాపాడతాడు, డబ్బుకు లోటు రానివ్వడు

Published : Feb 23, 2026, 04:26 PM IST

Rahu Zodiac Signs: జ్యోతిషంలో రాహువును దుష్ట గ్రహంగా చెప్పుకుంటారు. కానీ రాహువుకు కొన్ని రాశులంటే ప్రత్యేకమైన ఇష్టం ఉంటుంది. ముఖ్యంగా మూడు రాశుల వారికి రాహువు ఎప్పుడూ అండగా ఉంటాడు. ఆర్ధికంగా కలిసొచ్చేలా చేస్తాడు.

PREV
14
రాహువుకు ఇష్టమైన రాశులు

జ్యోతిషశాస్త్రంలో రాహువు ఒక ముఖ్యమైన గ్రహం. అలాగే  దీన్ని నీడ గ్రహంగా చెప్పుకుంటారు. రాహువు స్థానం సరైన స్థితిలో ఉంటే ఆ వ్యక్తికి రాజయోగం దక్కుతుంది. అదే చెడు స్థితిలో ఉంటే జీవితం తలకిందులు అవుతుంది. రాహువు వల్ల  గందరగోళం, అత్యాశ, ఆకస్మిక సంఘటనలు, ప్రయాణాలు, రాజకీయాలు, సాంకేతికత, ఆకస్మిక విజయం లేదా నష్టం వంటివి కలుగుతాయి. జాతకంలో రాహువు స్థానం బలంగా ఉంటే ఆ వ్యక్తి జీవితమే మారిపోతుంది. 

24
మిథున రాశి

మిథున రాశి వారికి రాహువు ఎంతో మంచి చేస్తాడు. ఈ రాశివారికి ఉచ్ఛస్థితిలో ఉంటాడు రాహువు.  రాహువు అత్యంత శక్తివంతమైన గ్రహంగా వీరికి చెప్పుకోవచ్చు. ఈ రాశి వారు ప్రతి పనిని ఆలోచనాత్మకంగా, తెలివిగా చేస్తారు. దీనివల్ల వారు వేగంగా అభివృద్ధి సాధిస్తారు. రాహువు సపోర్టు వీరికి పుష్కలంగా ఉంటుంది. తరచూ రాహు పూజలు చేస్తూ ఉంటే ఎంతో మంచిది.

34
కన్యా రాశి

కన్యా రాశిని రాహు గ్రహానికి మిత్ర రాశిగానే చెప్పుకోవాలి. ఈ రాశి వారి విజయంలో రాహు గ్రహం కీలక పాత్ర పోషిస్తుందని చెప్పుకోవాలి. ఈ రాశికి చెందిన వ్యక్తులు తమ ఆలోచనల విషయంలో చాలా స్పష్టతను కలిగి ఉంటారు. అందుకే వీరు ఏ తప్పు చేయడానికి సిద్ధంగా ఉండరు. వీరికి న్యాయం పట్ల బలమైన నమ్మకం ఉంటుంది.

44
కుంభ రాశి

కుంభ రాశి వారికి రాహువు వల్ల మేలే జరుగుతుంది. కుంభ రాశిని రాహువుకు అనుకూలమైన రాశిగానే చెప్పుకోవాలి. రాహువు కష్ట సమయాల్లో కుంభ రాశి వారికి అండగా నిలుస్తాడు. ఈ రాశి వారి కోరికలు నెరవేరడంలో రాహువు సహాయం చేస్తాడు. రాహువు కుంభ రాశిలోకి వచ్చినప్పుడు… వారికి ఊహించని సంపదను అందించే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories