సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 2, 11, 20, 29 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 2. ఈ సంఖ్య చంద్రుని ప్రభావంలో ఉంటుంది. చంద్రుని స్వభావం ఊహాశక్తి, సున్నితత్వం, భావోద్వేగం. దానివల్ల ఈ తేదీల్లో పుట్టినవారు.. పని చేయడానికి ముందు ఎక్కువగా ఆలోచిస్తారు. ఏ పని ఆనందంగా చేయడానికి ముందుకురారు. ఇతరులతో పోలిస్తే.. వీరు చురుకుగా కనిపించకపోవచ్చు. ఉదయం ఆలస్యంగా నిద్రలేవడం, పనులను లేటుగా మొదలుపెట్టడం, చిన్న పనికి కూడా ఎక్కువ సమయం తీసుకోవడం వంటి లక్షణాలు వీరిలో ఎక్కువగా కనిపిస్తాయి.