వాస్తు శాస్త్రం ప్రకారం చెబుతున్న ప్రకారం బూట్లు, చెప్పులతో రాహు, కేతువుల ప్రభావం ఎక్కువగా ఉంటుంది. చెప్పుల వల్ల నెగెటివ్ ఎనర్జీ వంటగదిలోకి చేరే అవకాశం ఉంది. ఆ నెగిటివ్ ఎనర్జీ చెప్పులు వేసుకుని వంట చేసిన ఆహారం ద్వారా కుటుంబ సభ్యులకు వ్యాపిస్తుంది. దీనివల్ల అనారోగ్యాలు వస్తాయి. అలాగే ఇంట్లో అనవసర గొడవలు, ధన నష్టం వంటివి జరిగే అవకాశం ఉంది.
వాస్తు, మతపరమైన కోణంలోనే కాదు ఈ విషయాన్ని సైన్సు పరంగా కూడా చూసినా కూడా ఈ అలవాటు చాలా హానికరం. మనం బయట తిరిగే చెప్పులతో పాటు సూక్ష్మక్రిములను, బ్యాక్టీరియాను ఇంట్లోకి వస్తాయి. అవే చెప్పులను వంటగదిలో వాడితే ఆ బ్యాక్టిరియా, వైరస్ మన ఆహారంలో చేరే అవకాశం ఉంది దీనివల్ల కుటుంబ సభ్యుల ఆరోగ్యం దెబ్బతినవచ్చు.