Weekly Horoscope: ఈ వారం 3 రాశులవారు ఈ విషయాల్లో జాగ్రత్తగా లేకపోతే కష్టమే!

Published : Mar 22, 2026, 07:00 AM IST

Weekly Horoscope: ఈ వార ఫలాలు 22.3.2026 నుంచి 28.3.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఈ వారం మేష రాశివారికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో మంచి పురోగతి కనిపిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. కానీ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. వ్యాపారంలో లాభాలు సాధారణ స్థాయిలో ఉంటాయి. ఖర్చులు కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగాలలో తోటివారితో సఖ్యతగా ఉండాలి. ఆరోగ్యపరంగా చిన్నచిన్న సమస్యలు ఉంటాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి.

313
వృషభ రాశి ఫలాలు

ఈ వారం వృషభ రాశివారికి స్థిరత్వం, సమతుల్యత కనిపిస్తుంది. ఉద్యోగంలో కృషికి తగిన గుర్తింపు లభిస్తుంది. ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి అవకాశాలు రావచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. ఆర్థికంగా లాభదాయకమైన సమయం. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో అనుబంధం పెరుగుతుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు.

413
మిథున రాశి ఫలాలు

ఈ వారం మిథున రాశివారికి కొంత ఒత్తిడి తప్పదు. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది, కానీ సమర్థంగా పూర్తిచేస్తారు. వ్యాపారంలో కొత్త పెట్టుబడుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఆర్థికంగా కొంత ఒడిదుడుకులు తప్పవు. ఒత్తిడి కారణంగా నిద్రలేమి సమస్యలు రావచ్చు. కుటుంబంలో చిన్నచిన్న విభేదాలు వస్తాయి. శాంతంగా పరిష్కరించుకోవాలి. మాటలపై నియంత్రణ అవసరం.

513
కర్కాటక రాశి ఫలాలు

ఈ వారం కర్కాటక రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మంచి ఫలితాలు వస్తాయి. పైఅధికారుల నుంచి ప్రశంసలు పొందే అవకాశం ఉంది. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి బాగుంటుంది. కుటుంబంతో గడిపే సమయం ఆనందాన్ని ఇస్తుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం. సృజనాత్మకత పెరుగుతుంది. స్నేహితులతో కలిసి కొత్త ప్రణాళికలు రూపొందిస్తారు.

613
సింహ రాశి ఫలాలు

ఈ వారం సింహ రాశివారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది. కానీ సమర్థంగా ఎదుర్కొంటారు. భాగస్వామ్య వ్యాపారాల్లో ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఆరోగ్యపరంగా చిన్న సమస్యలు ఉంటాయి. కుటుంబంలో కొంత అసహనం ఉండవచ్చు. నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఇతరుల అభిప్రాయాలను కూడా పరిగణలోకి తీసుకోవడం మంచిది.

713
కన్య రాశి ఫలాలు

ఈ వారం కన్య రాశివారికి మంచి అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త మార్గాలు తెరుచుకుంటాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంలో ఆనందకరమైన వాతావరణం ఉంటుంది. మీ ప్రణాళికలు విజయవంతమవుతాయి. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.

813
తుల రాశి ఫలాలు

ఈ వారం తుల రాశివారికి సానుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలు ఇస్తాయి. వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబ సభ్యులతో సంబంధాలు మెరుగుపడతాయి. కొత్త పరిచయాలు లాభదాయకంగా ఉంటాయి. దూర ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఈ వారం వృశ్చిక రాశివారు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగాల్లో పనులు ఆలస్యంగా పూర్తవుతాయి. వ్యాపారంలో నష్ట సూచనలు ఉన్నాయి. ఆర్థికంగా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉండొచ్చు. కుటుంబంలో కొంత ఉద్రిక్త వాతావరణం ఉంటుంది. కోపాన్ని నియంత్రించుకోవడం ముఖ్యం. నిర్ణయాల్లో తొందరపడకూడదు. ఆలోచించి ముందుకు సాగడం మంచిది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఈ వారం ధనుస్సు రాశివారికి శుభప్రదంగా ఉంటుంది. ఉద్యోగంలో మీ ప్రతిభ వెలుగులోకి వస్తుంది. వ్యాపారంలో లాభాలు పొందుతారు. ఆర్థికంగా బాగుంటుంది. ఆరోగ్యపరంగా చురుకుగా ఉంటారు. కుటుంబంతో ఆనందంగా గడుపుతారు. స్నేహితుల మద్ధతు లభిస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. మీ లక్ష్యాలను చేరుకునే దిశగా ముందుకు సాగుతారు.

1113
మకర రాశి ఫలాలు

ఈ వారం మకర రాశివారి కృషి ఫలిస్తుంది. ఉద్యోగంలో పనికి తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కానీ ఖర్చులను నియంత్రించాలి. ఆరోగ్యం విషయాల్లో శ్రద్ధ అవసరం. కుటుంబంలో శాంతి ఉంటుంది. మీ ప్రణాళికలు నెమ్మదిగా ముందుకు సాగుతాయి. సహనం విజయాన్ని తీసుకొస్తుంది.

1213
కుంభ రాశి ఫలాలు

ఈ వారం కుంభ రాశివారికి కొత్త అవకాశాలు వస్తాయి. ఉద్యోగంలో మార్పులు చోటు చేసుకుంటాయి. వ్యాపారంలో కొత్త ఆలోచనలు విజయవంతమవుతాయి. ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది. ఆరోగ్యం సహకరిస్తుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. మీ సృజనాత్మకత పెరుగుతుంది. కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది మంచి సమయం.

1313
మీన రాశి ఫలాలు

ఈ వారం మీన రాశివారికి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగంలో మీరు చేసిన కృషి ఫలిస్తుంది. వ్యాపారంలో లాభాలు పొందవచ్చు. ఆర్థికంగా స్థిరత్వం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. కుటుంబంతో సంతోషంగా గడుపుతారు. మీ ఆలోచనలు సఫలమవుతాయి. కొత్త అవకాశాలు దక్కుతాయి. ఇంటా బయటా అనుకూల వాతావరణం ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories