Sun Transit: మరో పదిరోజుల్లో అదృష్టవంతులయ్యే 4 రాశులు వారు వీరే, డబ్బు చేతికందుతుంది

Published : Jun 04, 2026, 10:22 AM IST

Sun Transit: గ్రహాలకు రాజు సూర్యుడు. జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించబోతున్నాడు. దీని వల్ల 4 రాశుల వారికి బాగా కలిసొస్తుంది. వీరికి అదృష్టం కలిసివస్తుంది. చేతికి డబ్బు సమయానికి అందుతుంది. విజయం దక్కుతుంది. 

PREV
14
మేషం

జూన్ 15న సూర్యుడు మిథున రాశిలోకి వెళ్లడం వల్ల మేష రాశి వారికి శుభప్రదంగా ఉంటుంది. ఈ రాశిలో జన్మించిన వారి జీవితం మారిపోతుంది. వీరిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. రావలసిన డబ్బు చేతికి అందుతుంది. వీరి ఆర్థిక పరిస్థితి బలపడుతుంది. వ్యాపారం మొదలుపెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. ప్రభుత్వం నుండి రావాల్సిన ప్రయోజనాలు అన్నీ అందుతాయి. వీరు కొత్త ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది. అదృష్టం బాగా కలిసి వచ్చి పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తి చేస్తారు.

24
మిథునం

సూర్యుడు మిథున రాశిలోకే అడుగుపెట్టబోతున్నాడు కాబట్టి ఈ రాశిలో జన్మించిన వారికి ఎంతో అదృష్టం దక్కుతుంది. వీరి వ్యక్తిత్వం మెరుగుపడుతుంది.నాయకత్వ లక్షణాలు స్పష్టంగా కనిపిస్తాయి. చుట్టుపక్కల వారు ప్రశంసిస్తారు. వీరు తమ మాటలను తెలివిగా ఉపయోగిస్తే వీరికి అపారమైన ప్రయోజనాలు దక్కుతాయి. వీరి ఆదాయం కూడా పెరుగుతుంది.

34
సింహ రాశి

సింహ రాశికి అధిపతి సూర్యుడు. కాబట్టి మిథున రాశిలోకి సూర్య సంచారం ఈ రాశి వారిపై చాలా ప్రభావాన్ని చూపిస్తుంది. సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల సింహరాశి వారికి శుభ ఫలితాలు దక్కుతాయి. అనేక మార్గాల నుండి డబ్బు చేతికి అందుతుంది. ఉద్యోగంలో ఉన్నవారికి ప్రమోషన్ దక్కవచ్చు. వ్యాపారంలో లాభాలు వస్తాయి.

44
మకర రాశి

సూర్యుడు మిథున రాశిలోకి ప్రవేశించడం వల్ల మకర రాశి వారికి సానుకూల ఫలితాలు దక్కుతాయి. అనారోగ్యాలతో బాధపడుతున్న వారికి లభించవచ్చు. వీరు వృత్తి పరంగా చాలా బలపడతారు. అన్ని రకాలుగా విజయాన్ని సాధిస్తారు. ఆర్థికంగా బలంగా మారుతారు.

Read more Photos on
click me!

Recommended Stories