3.ధనస్సు రాశి...
కేతువు , బుధ గ్రహాల కలయిక మీకు సానుకూల మార్పులను తెస్తుంది. ఎందుకంటే ఈ సంయోగం మీ రాశి నుండి తొమ్మిదవ ఇంట్లో ఏర్పడుతుంది. ధనుస్సు రాశి వారికి, కేతు-బుధ సంయోగం వివిధ వ్యాపారాల నుండి లాభాలను ఆర్జించడానికి అనువైన సమయం. ఈ సమయం పనిలో వివిధ ప్రాజెక్టులలో పాల్గొనడానికి శుభ సమయం అవుతుంది. చేసిన కష్టానికి ప్రతిఫలం లభిస్తుంది. ఉద్యోగం కోసం చూస్తున్న వారికి మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. అలాగే, అధికారులు , సహోద్యోగుల నుండి మీకు మంచి మద్దతు లభిస్తుంది. మీకు కార్యాలయంలో కొత్త బాధ్యతలు, అవకాశాలు లభిస్తాయి. మీ సామాజిక ప్రతిష్ట పెరుగుతుంది. కొత్త సంబంధాలు మంచి ఫలితాలను ఇస్తాయి.ఈ సమయంలో, మీరు ఏదైనా మతపరమైన లేదా శుభ కార్యక్రమంలో పాల్గొనవచ్చు. కొత్త ఆదాయ వనరులు తెరుచుకుంటాయి. సామాజిక కార్యక్రమాలలో పాల్గొనడం మంచిది. విద్యార్థులు పోటీ పరీక్షల్లో విజయం సాధిస్తారు.