నేడు ఈ రాశివారికి సొంత ఆలోచనలు అస్సలు కలిసిరావు!

Published : Sep 24, 2025, 05:00 AM IST

Today Rasi Phalalu: ఈ రాశి ఫలాలు 24.09.2025 బుధవారానికి సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి.

PREV
113
నేటి రాశి ఫలాలు

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. నేడు ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి వివాదాలకు సంబంధించిన కీలక సమాచారం అందుతుంది. చేపట్టిన పనులలో జాప్యం ఉన్నప్పటికీ నిదానంగా పూర్తిచేస్తారు.ఆర్థిక పరిస్థితి కొంత వరకు అనుకూలిస్తుంది. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో చర్చలు సఫలమవుతాయి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

313
వృషభ రాశి ఫలాలు

ఇతరులతో ఊహించని వివాదాలు కలుగుతాయి. కుటుంబ సభ్యులు మీ మాటతో విభేదిస్తారు. పిల్లల ఆరోగ్యం విషయంలో వైద్య సంప్రదింపులు అవసరమవుతాయి. వృత్తి, ఉద్యోగాలలో పని ఒత్తిడి పెరుగుతుంది. వ్యాపారాల్లో విలువైన వస్తువుల విషయంలో మరింత జాగ్రత్త అవసరం. దైవ చింతన పెరుగుతుంది.

413
మిథున రాశి ఫలాలు

శారీరక, మానసిక అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. తల్లితరపు బంధువులతో మాటపట్టింపులు ఉంటాయి. అప్పుల ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన ప్రతి పనిలో అడ్డంకులు తప్పవు. వృత్తి, వ్యాపారాలలో మిశ్రమ ఫలితాలుంటాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు.

513
కర్కాటక రాశి ఫలాలు

నూతన వస్త్రాభరణాలు కొనుగోలు చేస్తారు. అన్ని వైపుల నుంచి అనుకూలత పెరుగుతుంది. కుటుంబ వ్యవహారాలలో మీ నిర్ణయాలు అందరికి నచ్చే విధంగా ఉంటాయి. నిరుద్యోగులకు కొత్త అవకాశాలు లభిస్తాయి. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. సోదరులతో స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి.

613
సింహ రాశి ఫలాలు

ప్రారంభించిన పనులలో జాప్యం కలుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు తప్పవు. ఇంటా బయటా దీర్ఘకాలిక సమస్యలు చికాకు కలిగిస్తాయి. కుటుంబ సభ్యులతో మాటపట్టింపులు ఉంటాయి. వృత్తి, వ్యాపారాలలో సొంత ఆలోచనలు కలిసిరావు. దైవ చింతన కలుగుతుంది.

713
కన్య రాశి ఫలాలు

ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. ఇంటా బయటా సమస్యలు ఉన్నప్పటికీ నిదానంగా పరిష్కరించుకుంటారు. వృత్తి, వ్యాపారాలలో నష్టాలు అధిగమించి లాభాలు పొందుతారు. ఉద్యోగాల్లో అధికారులతో మాట్లాడేటప్పుడు జాగ్రత్త వహించాలి. స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు ఫలిస్తాయి.

813
తుల రాశి ఫలాలు

కీలక వ్యవహారాలలో ఊహించని ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశీ ప్రయాణ సూచనలు ఉన్నాయి. అనుకోని విధంగా ఖర్చులు పెరుగుతాయి. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి. వృత్తి, ఉద్యోగాలలో ఇతరులతో తొందర పడి మాట్లాడటం మంచిది కాదు. వ్యాపారాల్లో స్వల్ప నష్టాలు తప్పవు.

913
వృశ్చిక రాశి ఫలాలు

ఆదాయ మార్గలు పెరుగుతాయి. ఇతరుల సహాయ సహకారాలతో కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. దీర్ఘాకాలిక అప్పులు తీరుతాయి. పిల్లలకు విద్యా, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. ప్రశాంతంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగాలలో అధికారుల అనుగ్రహం కలుగుతుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

చుట్టుపక్కల వారితో స్థిరాస్తి వివాదాలు కలుగుతాయి. ఉద్యోగులు ఉన్నత పదవులు పొందుతారు. కొన్ని వ్యవహారాలలో ఆత్మవిశ్వాసంతో స్థిరమైన నిర్ణయాలు తీసుకొని లాభాలు అందుకుంటారు. నిరుద్యోగులకు లభించిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. ఇంటా బయటా గౌరవ మర్యాదలు పెరుగుతాయి.

1113
మకర రాశి ఫలాలు

సంఘంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. గృహ నిర్మాణ పనులకు శ్రీకారం చుడతారు. వృత్తి, వ్యాపారాలలో ఆశించిన లాభాలు అందుకుంటారు. సంతాన వివాహ, ఉద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి. వారి ఆరోగ్యం విషయంలో శుభవార్తలు అందుతాయి. ఆర్థికంగా అనుకూల వాతావరణం ఉంటుంది.

1213
కుంభ రాశి ఫలాలు

అనుకున్న స్థాయిలో సౌకర్యాలు లభించక ఇబ్బందిపడతారు. దూర ప్రయాణాలు వాయిదా పడుతాయి. డబ్బు విషయంలో ఇతరులకు మాట ఇవ్వడం మంచిది కాదు. వృత్తి, ఉద్యోగాలలో నిలకడ లోపిస్తుంది. కొందరి ప్రవర్తన చికాకు కలిగిస్తుంది.  

1313
మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల నుంచి శుభవార్తలు అందుతాయి. నూతన వాహనం కొనుగోలు చేస్తారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. బంధుమిత్రుల రాక ఆనందం కలిగిస్తుంది. వృత్తి, ఉద్యోగాలలో తోటివారి సాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories