Zodiac Signs: ఈ 4 రాశులవారికి ఓపిక చాలా తక్కువ.. ఒక్క నిమిషం ఆలస్యమైనా భరించలేరు!

Published : Dec 10, 2025, 06:22 PM IST

సాధారణంగా కొందరు వ్యక్తులు చాలా ఫాస్ట్ గా ఉంటారు. అన్నీ పనులు చకచక పూర్తికావాలని కోరుకుంటారు. నిమిషం ఆలస్యమైనా ఒప్పుకోరు. వీరికి ఓపిక చాలా తక్కువ. అయితే ఈ గుణాలు వారి జన్మ రాశుల ప్రభావం వల్ల వస్తాయని జ్యోతిష్యశాస్త్రం చెబుతోంది. ఆ రాశులేంటో చూద్దాం. 

PREV
15
ఓపిక తక్కువగా ఉండే రాశులు

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని రాశులవారికి ఓపిక చాలా తక్కువ. వీరికి సహజంగానే వేగం, తొందర, ఆత్రుత ఎక్కువగా ఉంటాయి. ఒక పని వెంటనే జరగకపోయినా, ఎవరైనా సమాధానం ఆలస్యంగా చెప్పినా, లేదా ఎదుటివారు తమ ఆలోచనలు అందుకునేంత స్పీడ్ గా లేకపోయినా వీరు చిరాకు, అసహనం వ్యక్తంచేస్తారు. ముఖ్యంగా ఈ నాలుగు రాశులవారిలో ఈ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఆ రాశులేంటో చూసేయండి.

25
మేష రాశి

మేష రాశి అగ్నితత్త్వానికి చెందింది. కాబట్టి ఈ రాశివారి స్వభావంలో వేగం, ఉత్సాహం సహజమైనవి. వారు ఏ పనిచేసినా వెంటనే ఫలితం రావాలని, ఇతరులు వెంటనే స్పందించాలని కోరుకుంటారు. చిన్న చిన్న ఆలస్యాలకు కూడా వీరు చిరాకు పడతారు. అయితే వీరికుండే ఈ వేగమే కొన్నిసార్లు విజయాలను అందిస్తుంది. 

35
మిథున రాశి

మిథున రాశి గాలితత్త్వానికి చెందింది. కాబట్టి ఈ రాశివారి ఆలోచనలు, భావనలు, సంభాషణలు చాలా స్పీడ్ గా ఉంటాయి. మిథున రాశివారు నిమిషానికి పది ఆలోచనలు చేస్తారు. ఏ పనైనా ఆలస్యమైతే వెంటనే బోర్ ఫీలవడం, అసహనం వ్యక్తం చేయడం వీరి సహజ గుణం. ఒక్క నిమిషం వృథా అయినా వీరు భరించలేరు. వీరి మెదడు ఎప్పుడూ కొత్త ఆలోచనలు, కొత్త పనులు కోరుకుంటుంది. ఎదుటి వ్యక్తి నిదానంగా మాట్లాడితే కూడా వీరికి నచ్చదు. లోలోపల చిరాకు పడుతారు. 

45
సింహ రాశి

సింహరాశి వారికి నాయకత్వ లక్షణాలు, ఆత్మవిశ్వాసం, దృఢత్వం ఎక్కువ. కానీ వీరు తమ పనులు ఇతరుల వల్ల ఆలస్యం కావడాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోరు. తాము చెప్పిన మాట వెంటనే అమలు కావాలని ఆశిస్తారు. ఎదుటి వ్యక్తి నిదానంగా స్పందించినట్లయితే, చిన్న విషయాల్లో కూడా వీరు కోపం, అసహనం వ్యక్తం చేస్తారు. వీరు టైంని చాలా సీరియస్‌గా తీసుకుంటారు. సమర్థత, పర్ఫెక్షన్, వేగం వీరి సహజ స్వభావం.

55
ధనుస్సు రాశి

ధనుస్సు రాశివారు స్వేచ్ఛ, ప్రయాణాలు, వేగవంతమైన జీవితాన్ని ఇష్టపడతారు. వీరి మనసు ఒక చోట స్థిరంగా ఉండదు. ఎప్పుడూ కొత్త విషయాలు తెలుసుకోవడం, కొత్త పనులు చేయడం, కొత్త దిశలో అడుగులు వేయడం వంటి ఆలోచనలతో నిండిపోతుంది. వెయిట్ చేయడం అనేది ఈ రాశివారికి పెద్ద పరీక్ష లాంటిది. పనులు ప్లాన్ ప్రకారం టైమ్‌కి జరగకపోతే వీరికి వెంటనే చిరాకు వస్తుంది. అయితే వీరికి కోపం ఎంత ఫాస్ట్ గా వస్తుందో అంతే ఫాస్ట్ గా తగ్గుతుంది.

Read more Photos on
click me!

Recommended Stories