AI ( ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్) గురించి భారీ హెచ్చరికలు...
బాబా వంగా ప్రకారం, 2026 నాటికి కృత్రిమ మేథస్సు మానవ బుద్ధిని దాటిపోతుంది. మనిషి చేసే చాలా పనులను యంత్రాలు స్వయంగా చేయగలుగుతాయి. దీని వల్ల లక్షలాది మంది ఉద్యోగాలు కోల్పోవచ్చు.
ఆమె అంచనా ప్రకారం....
యంత్రాలు మానవులను ఆజ్ఞాపించినట్లుగా విననని, భవిష్యత్తులో మానవ ప్రభావానికి వ్యతిరేకంగా పని చేస్తాయని, మానవ నియంత్రణను తిరస్కరించే పరిస్థితి రావచ్చని హెచ్చరించింది. ఏఐ వేగంగా ఎదుగుతున్న తీరు చూస్తే, ఇది చాలా మందికి నిజం అయ్యే అవకాశం ఉందని అనిపిస్తోంది.
అనుకోని ప్రమాదాలు...
బాబా వంగా ప్రకారం, 2026లో ప్రకృతి పరంగా చాలా మార్పులు జరిగే అవకాశం ఉంది. చాలా ప్రకృతి వైపరీత్యాలు అధికమయ్యే అవకాశం కూడా ఉంది. ద్వీప దేశాల్లో భారీ భూకంపాలు, అగ్నిపర్వాతల విస్ఫోటం, తీవ్రమైన పర్యావరణ మార్పులు వచ్చే అవకాశం ఉంది. దీని వల్ల చాలా ప్రాణ, ఆస్తి నష్టం కూడా జరిగే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.
గతంలో నిజమైన బాబా వంగా జోస్యం....
12 సంవత్సరాల వయసులో కంటి చూపు కోల్పోయిన తర్వాత ఆమె అంతర దృష్టి తో అనేక అంచనాలు చెప్పడం ప్రారంభించింది. ఆమె ముందుగా చెప్పిన కొన్ని నిజమైన సంఘటనలు...
కరోనా వైరస్ మహమ్మారి
1990ల గల్ఫ్ యుద్ధం
అనేక భూకంపాలు
యూరప్‌లో అంతర్గత రాజకీయ కల్లోలం
అలాగే 2028లో మరో కొత్త వైరస్ ప్రపంచానికి పెద్ద ప్రమాదమని ఆమె హెచ్చరించింది.
సారాంశం
బాబా వంగా చెప్పిన ప్రతి అంచనా నిజమైందని చెప్పలేం. కానీ ఆమె ముందుగా చెప్పిన అనేక విషయాలు నిజమయ్యాయని చూస్తే, ప్రజలు 2026 ప్రవచనాలపై ఎక్కువ దృష్టి పెడుతున్నారు. AI ఎదుగుతున్న వేగం, ప్రకృతి మార్పులు, అంతరిక్ష పరిశోధన ఇవి ఆమె మాటలను కొంతవరకు నిజంగానే అనిపించేలా చేస్తున్నాయి.