Impatient Zodiac Signs: ఈ 4 రాశుల వారికి అస్సలు ఓపిక ఉండదు, విపరీతమైన కోపం

Published : Dec 12, 2025, 02:20 PM IST

Impatient Zodiac Signs: జ్యోతిషశాస్త్రం చెబుతున్న ప్రకారం కొన్ని రాశులలో జన్మించిన వారికి అస్సలు సహనం ఉండదు. అన్ని విషయాలలో తొందర ఎక్కువ. కోపం కూడా త్వరగా వస్తుంది. ఆ రాశులేవో తెలుసుకోండి.

PREV
15
సహనం లేని రాశులు ఇవే

జ్యోతిషశాస్త్రం ప్రకారం ప్రతి రాశికి ప్రత్యేక వ్యక్తిత్వం, గుణాలు, లక్షణాలు ఉంటాయి. కొన్ని రాశుల వారికి ఏమాత్రం సహనం ఉండదు. అన్ని విషయాల్లోనూ తొందరే.  వీరు సహజంగానే చాలా వేగంగా నిర్ణయాలు తీసుకుంటారు. పనులు ఏ మాత్రం ఆలస్యమైనా విపరీతంగా చిరాకు పడతారు.

25
మేష రాశి

అసహనపరుల జాబితాలో మేషరాశి వారిదే మొదటి స్థానం. ఈ రాశి వారిని పాలించేది కుజుడు. వీరికి ఏ పనైనా వెంటనే అయిపోవాలి. ఆలస్యమైతే ఆగలేరు. వెయిట్ చేయడం ఏమాత్రం ఇష్టపడరు.  ఆలస్యం జరిగితే చాలు కోపం చిరాకు పెరిగిపోతుంది. 

35
మిథున రాశి

మిథున రాశి వారు చాలా చురుగ్గా ఉంటారు.  వీర ఏ నిర్ణయాలపై చురుకుగా  వేగవంతంగా ఆలోచనలు కలిగి ఉంటారు.  ఈ రాశి వారికి బుధుడు పాలిస్తాడు. వీరికి చాలా విసుగు ఎక్కువ. వారి విసుగే దీరికి మొదటి శత్రువు. వీరికి చాలా సహనం తక్కువ. 

45
సింహ రాశి

సింహ రాశి వారికి బలమైన నాయకత్వ లక్షణాలుంటాయి. ఈ రాశి వారిని సూర్యుడు పాలిస్తాడు. వీరు రాజులా గౌరవాన్ని కోరుకుంటారు. ఆశించిన గౌరవం లభించకపోతే వీరికి విపరీతంగా  కోపం వచ్చేస్తుంది.  సహనం త్వరగా కోల్పోతారు. అన్నీ వేగంగా జరిగిపోవాలనుకుంటారు.

55
ధనుస్సు రాశి

ధనుస్సు రాశి వారు సాహసోపేతంగా ఉంటారు. విపరీతంగా స్వేచ్ఛను కోరుకుంటారు. ఈ రాశి వారికి బృహస్పతి పాలిస్తాడు. వీరి స్వేచ్ఛకు పరిమితులు విధిస్తే అసహనానికి గురవుతారు. ఉత్సాహం లేని పనులు వీరికి నచ్చవు. ఎక్కువ సమయం పట్టే పనులతో విసుగు చెందుతారు.

Read more Photos on
click me!

Recommended Stories