Birth Stars: మీరు ఈ నక్షత్రాల్లో పుట్టారా? 2026లో కోటీశ్వరులు కావడం పక్కా..!

Published : Dec 12, 2025, 11:54 AM IST

Birth Stars: కొత్త సంవత్సరం లో మీ నక్షత్రాల ఆధారంగా మీకు ఎలా గడుస్తుందో తెలుసుకోవచ్చు. ముఖ్యంగా కొన్ని నక్షత్రాల్లో పుట్టినవారికి అద్భుతంగా ఉండనుంది. వారి ఆర్థిక సమస్యలన్నీ తీరి, కెరీర్ లోనూ ఉన్నత స్థాయికి వెళతారు. మరి, ఆ నక్షత్రాలేంటో చూద్దాం

PREV
14
Birth stars

అశ్వినీ నక్షత్రం....

అశ్వినీ నక్షత్రంలో పుట్టిన వారికి 2026 చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ ఏడాది ఈ నక్షత్రంలో పుట్టిన వారికి కెరీర్ లో మంచి పురోగతి సాధిస్తారు. ఉద్యోగచ వ్యాపారాల్లో కొత్త అవకాశాలు వస్తాయి. అంతేకాదు.. ఊహించని రీతిలో ఆదాయం పెరుగుతుంది. వీరికి విదేశీ అవకాశాలు వచ్చే ఛాన్స్ లు కూడా మెండుగా ఉన్నాయి. ఈ ఏడాది వీరికి లక్కీ సంవత్సరం కానుంది.

రోహిణీ నక్షత్రం....

2026 రోహిణీ నక్షత్రంలో పుట్టిన వారికి కూడా విపరీతంగా కలిసొస్తుంది. ముఖ్యంగా వ్యాపారం చేసే వారికి లాభాలు వస్తాయి. ఎందులో పెట్టుబడులు పెట్టినా రెట్టింపు లాభాలు అందుకుంటారు. ఇక.. కుటుంబంలో శుభ కార్యాలు జరిగే అవకాశం కూడా ఉంటుంది. వీరు ఆర్థికంగా చాలా బలపడే అవకాశం ఉంది. కోటీశ్వరులు అయ్యే సూచనలు కనపడుతున్నాయి.

24
ఈ నక్షత్రంలో పుట్టిన వారికి కూడా.....

పునర్వసు నక్షత్రం...

పునర్వసు నక్షత్రంలో పుట్టిన వారికి 2026 చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి గతంలో ఏవైనా ఆరోగ్య సమస్యలు ఉంటే అవి తీరిపోయే అవకాశం ఉంది. ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఉద్యోగంలో ఊహించని మార్పులు జరుగుతాయి. అవి కూడా వీరికి అనుకూలంగానే ఉంటాయి. ఈ ఏడాది ఏదైనా కొత్త ప్రాపర్టీ లేదా వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది.

మఖ నక్షత్రం...

మఖ నక్షత్రంలో పుట్టిన వారికి 2026 బాగా కలిసొస్తుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి సహజంగానే నాయకత్వ లక్షణాలు ఉంటాయి. ఈ ఏడాది వీరి లీడర్ షిప్ క్వాలిటీస్ మరిన్ని పెరిగే అవకాశం ఉంది. అందరూ వీరి మాటలు అనుసరిస్తారు. ఇక.. వీరికి వ్యాపారాల్లో లాభాలు వచ్చే అవకాశం ఉంది. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి ఇప్పుడు లాభాలు అందుకుంటారు. ఈ ఏడాది వీరికి వైభోగం పెరుగుతుంది. సంపద రెట్టింపు అవుతుంది.

34
లైఫ్ లో సక్సెస్...

హస్త నక్షత్రం...

హస్త నక్షత్రంలో పుట్టిన వారికి కూడా 2026 అద్భుతంగా కలిసొస్తుంది. సృజనాత్మక రంగాల్లో పుట్టిన వారికి గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి. ఉద్యోగం చేసే వారికి ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఉంది. కనీసం ఇంక్రిమెంట్స్ అయినా పొందుతారు. ఇక.. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ప్రేమ, వివాహ విషయాలు సానుకూలంగా మారతాయి. ఇంట్లో పెద్దలను ఒప్పించి మరీ పెళ్లి చేసుకునే ఛాన్స్ లు ఉన్నాయి.

6.అనురాధ నక్షత్రం...

అనురాధ నక్షత్రంలో పుట్టిన వారికి ఈ కొత్త సంవత్సరం చాలా అనుకూలంగా ఉంటుంది. శత్రువుల నుంచి విముక్తి లభిస్తుంది. ఏ పనులు అయినా సులభంగా పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత లభిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు.

44
వీరికి అష్ట ఐశ్వర్యాలు...

శతభిష నక్షత్రం...

శతభిష నక్షత్రంలో పుట్టిన వారికి కూడా 2026 చాలా అనుకూలంగా ఉంటుంది. ఈ నక్షత్రంలో పుట్టిన వారికి ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఆరోగ్య సమస్యలన్నీ తీరిపోతాయి. పరిశోధన, టెక్నాలజీ రంగాల్లో గొప్ప ఫలితాలు పొందుతారు. ఆదాయం పెరుగుతుంది. వ్యాపారాల నుంచి లాభాలు పొందుతారు.

8.రేవతి నక్షత్రం...

రేవతి నక్షత్రంలో పుట్టిన వారికి కూడా 2026 చాలా అనుకూలంగా ఉంటుంది. వీరి అదృష్టం రెట్టింపు అవుతుంది. అప్పుల బాధ తీరిపోతుంది. ప్రయాణాలు, కొత్త ప్రాజెక్టులు చాలా అనుకూలంగా ఉంటుంది.

Read more Photos on
click me!

Recommended Stories