Ketu Transit: కేతు గోచారంతో ఈ 3 రాశులకు లాభాలు.. వీరి అదృష్టాన్ని ఎవరూ ఆపలేరు

Published : Nov 27, 2026, 12:55 PM IST

Ketu Transit: సింహ రాశిలో ఉన్న కేతువు 2026 డిసెంబర్ 5న కర్కాటక రాశిలోకి మారుతాడు. 18 నెలల పాటు ఉండే ఈ మార్పుతో 3 రాశుల వారికి ఆదాయం, ఉద్యోగం, వ్యాపారాల్లో అనుకూల మార్పులు రానున్నాయి.

PREV
13
వృషభం

వృషభ రాశి వారికి కేతు గోచారంతో అనుకూల మార్పులు వస్తాయని అంచనా వేస్తున్నారు. ఇప్పటి వరకు ఆలస్యమైన పనులు పూర్తవుతాయి. ఉద్యోగం వెతికే వారికి మంచి అవకాశాలు వస్తాయి. ఇప్పటికే ఉద్యోగం చేస్తున్న వారికి కొత్త బాధ్యతలు లేదా జీతం పెరిగే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులకు కొత్త కస్టమర్లు వచ్చి లాభాలు పెరుగుతాయి. ఆదాయాన్ని ప్లాన్ చేసుకొని ఖర్చులు తగ్గిస్తే పొదుపు పెరుగుతుందని జ్యోతిష్యులు చెబుతున్నారు.

23
కన్య

కన్యా రాశి వారికి ఈ గోచారం ఉద్యోగం, వ్యాపారంలో వృద్ధిని తెస్తుంది. ముఖ్యంగా ఉద్యోగులకు జీతం పెరగడం లేదా ప్రమోషన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగం మారాలనుకునే వారికి కొత్త అవకాశాలు వస్తాయి. వ్యాపారులకు ఆదాయం పెంచుకునే కొత్త మార్గాలు కనిపిస్తాయి. గతంలో ఎదుర్కొన్న సమస్యల నుంచి మెల్లగా బయటపడి, ఆత్మవిశ్వాసంతో కొత్త పనులు మొదలుపెట్టే వాతావరణం ఏర్పడుతుంది.

33
కుంభం

కుంభ రాశి వారికి కేతు గోచారం ఆర్థిక పరిస్థితిని మెరుగుపరుస్తుందని జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. వ్యాపారం చేసే వారికి కొత్త అవకాశాలు వచ్చి లాభాలు పెరుగుతాయి. వ్యాపారంలో ఉన్న అడ్డంకులు క్రమంగా తగ్గుతాయి. ఆదాయాన్ని స్థిరంగా ఉంచుకోవడానికి కొత్త మార్గాలు ఏర్పడతాయి. కుటుంబంలో సంతోషం నెలకొంటుంది, పిల్లలకు సంబంధించిన శుభవార్తలు వింటారు. డబ్బు పొదుపుపై దృష్టి పెడితే బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవచ్చు.

Read more Photos on
click me!

Recommended Stories