తుల రాశివారికి శని మార్గగమనం శుభ పరిణామాలకు కారణం అవుతుంది. ముఖ్యంగా ఆర్థిక పరిస్థితుల్లో మెరుగుదల కనిపిస్తుంది. ఉద్యోగం చేస్తున్నవారికి కొత్త అవకాశాలు, ప్రమోషన్లు లభించే సూచనలు ఉన్నాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు భవిష్యత్తులో ఉపయోగపడే విధంగా ఉంటాయి. చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్న పనులు పూర్తవుతాయి. జీవిత భాగస్వామితో ఉన్న అపార్థాలు తొలగిపోతాయి.