కుంభ రాశి...
ఫిబ్రవరి 3, 2026న బుధుడు కుంభ రాశిలోకి సంచరిస్తాడు. ఈ సమయంలో కుంభ రాశివారు కొన్ని జోతిష్య పరిహారాలను పాటిస్తే... ధనవంతులు అయ్యే అదృష్టం పొందవచ్చు. కాబట్టి, ఈ కాలంలో ఏ పనులు చేయడం శుభప్రదమూ తెలుసుకుందాం..
ఈ సమయంలో అనాథలకు, వృద్ధులకు లేదా అవసరమైన వారికి దానం చేయడం అత్యంత శుభప్రదమైన ఫలితాలను ఇస్తుంది. మీ ఆర్థిక జీవితంపై బుధుడి ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది. ఆస్పత్రులు, నిరాశ్రయులు, మతపరమైన కార్యక్రమాలలో పాల్గొని మీకు తోచినంత సహాయం చేయండి. జంతువులు, పక్షులకు ఆహారం పెట్టడం, వాటికి చికిత్స చేయడం వల్ల కూడా పుణ్యం లభిస్తుంది. మీ అదృష్టం రెట్టింపు అవుతుంది.