Zodiac Signs: ఈ 4 రాశులలో పుట్టిన వారు కచ్చితంగా టీమ్‌ని నడిపించే లీడర్లవుతారు

Published : Jan 25, 2026, 06:38 AM IST

Zodiac Signs:  పుట్టిన రాశిని బట్టి ఒక వ్యక్త భవిష్యత్తు, గుణగణాలు, అతడి లక్షణాలు, విజయాలు అంచనా వేసి చెప్పవచ్చు. కొందరు పుట్టుకతోనే నాయకులుగా ఉంటారు. ఏ రాశులలో పుట్టిన వారు నాయకులుగా ఎదుగుతారో తెలుసుకోండి.

PREV
14
మేష రాశి

మేషరాశిలో పుట్టిన వారికి నాయకత్వ లక్షణాలు ఉంటాయి.  కుజుడి వల్ల ఈరాశి వారి శక్తి పెరుగుతుంది. ఏ పనినైనా ధైర్యంగా ప్రారంభిస్తారు. సాహసోపేత నిర్ణయాలు తీసుకోవడం ముందుంటారు. ఎలాగైనా అనుకున్న లక్ష్యాలను సాధిస్తారు. వీరికి పోటీతత్వం ఎక్కువ. అందుకే ప్రారంభించిన పనులను వేగంగా పూర్తిచేస్తారు. ఈ రాశివారు తమ టీమ్ లో ఉన్న ప్రతి సభ్యుడిని ప్రోత్సహిస్తూ తమతో పాటూ ముందుకు తీసుకువెళతారు. మేషరాశి వారిని సహజ కమాండర్లు అనొచ్చు. వారికి నాయకులుగా ఎదిగే లక్షణాలు ఈ రాశిలో పుట్టడం వల్లే వచ్చాయి.

24
సింహ రాశి

సింహ రాశి వారు పేరుకు తగ్గట్టే సింహంలా ఉంటారు. వీరికి నాయకత్వ లక్షణాలు పుట్టుకతోనే వస్తాయి. వీరిపై సూర్యుడి ప్రభావం ఎక్కువ.  ఎవరినైనా ఇట్టే ఆకర్షిస్తారు.  విశ్వాసంతో తమ టీమ్ ను ముందుకు నడిపిస్తారు. ఉత్సాహంతో టీమ్‌ను ఐక్యంగా ఉంచగలిగే శక్తి వీరికి ఉంది.   సీఈఓ లాంటి పెద్ద పదవులకు వీరు సరిగ్గా సరిపోతారు. టీమ్ బలాన్ని గుర్తించి, కంపెనీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లే సత్తా వీరికి ఉంది.

34
మకర రాశి

మకర రాశి వారిపై శని ప్రభావం ఎక్కువగా ఉంటుంది.  అందుకే వారు క్రమశిక్షణకు మారుపేరులా ఉంటారు. ఏ పని చేయాలన్నా ముందుగానే అన్నీ ప్లాన్ చేసుకుంటారు. ఆ ప్లానింగ్ కు తగ్గట్టు అమలు చేయడంలో వీరు నిపుణులు. ఈ రాశిలో పుట్టిన వారు ప్రభుత్వ అధికారులుగా లేదా కార్పొరేట్ రంగంలో పెద్ద పదవులను సమర్థవంతంగా నిర్వహించగలరు. మంచి నాయకులుగా ఎదుగుతారు. 

44
వృశ్చిక రాశి

కుజుడు, కేతువు వృశ్చిక రాశి వారిని పాలిస్తారు. వీరికి  ఏకాగ్రత చాల ఎక్కువ. మానసిక అంతర్దృష్టితో ఏ సమస్యనైనా చాలా సులువుగా పరిష్కరిస్తారు. సవాళ్లు ఎదురుతున్నా పట్టించుకోకుండా వాటిని విజయానికి మెట్లుగా మార్చుకోవడంలో వీరు నిపుణులు. తమ తెలివితో ప్రతి పనిని చక్కగా పూర్తి చేసి ముందుకు వెళతారు. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోవడంలో వీరు మంచి పనితనం కలవారు.

Read more Photos on
click me!

Recommended Stories