Mars Blessings: ఈ 3 రాశులకు ఫుల్లుగా కుజుడి ఆశీస్సులు, సంపద, గౌరవం అన్నీ వీరివే

Published : Jan 20, 2026, 04:11 PM IST

Mars Blessings: నవగ్రహాలలో అంగారకుడు ముఖ్యమైన గ్రహం. ఒక వ్యక్తి జాతకంలో కుజుడు బలంగా ఉంటే, ఆ వ్యక్తి జీవితంలో ఎంతో ఆనందంగా ఉంటుంది. ఎన్నో సుఖాలు, విలాసాలు దక్కుతాయి. కుజుడికి ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. 

PREV
14
కుజ గ్రహం ఆశీస్సులు

నవగ్రహాలలో కుజుడు చాలా ముఖ్యమైన వాడు. ఒకరి జాతకంలో అంగారకుడి స్థానం వ్యక్తిత్వాన్ని, ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. కుజుడు బలంగా ఉంటే జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది. ఎన్నో శుభ ఫలితాలు కలుగుతాయి. అదే ఒక వ్యక్తి జాతకంలో  కుజుడు బలహీనంగా ఉంటే ఆ వ్యక్తి జీవితంలో ప్రతికూల ఫలితాలు కలుగుతాయి. జ్యోతిషశాస్త్రంలో కుజుడు చాలా ముఖ్య పాత్ర పోషిస్తాడు. అయితే కుజుడికి ఇష్టమైన రాశులు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మూడు రాశుల వారికి కుజగ్రహం ఆశీస్సులు దక్కుతాయి.

24
మేష రాశి

మేషరాశి వారిపై అంగారకుడి ప్రభావం అధికం. ఈ రాశి వారు చాలా ఉత్సామంగా ఉంటారు. వీరు శక్తివంతంగా, ధైర్యంగా, నాయకత్వ లక్షణాలతో ఉంటారు. సైనిక, పరిపాలన, వ్యాపార రంగాల్లో విజయం సాధిస్తారు. కాబట్టి ఆ రంగాల్లోనే వీరు ఉద్యోగాలు లేదా వ్యాపారాలు చేయడం మంచిది. వారికి అన్ని రకాలుగా కలిసివస్తుంది. కుబేరుడి వల్ల వీరి జీవితంలో అన్ని విలాసాలు, ఆనందాలు దక్కుతాయి.

34
వృశ్చిక రాశి

వృశ్చిక రాశికి అధిపతి అంగారకుడు. సొంత రాశి కాబట్టి కుజుడు వీరిపై అతి ప్రేమను చూపిస్తాడు. ఈ రాశి వారికి అపారమైన శక్తి, ఉత్సాహంతో పనులు చేస్తారు. జీవితంలో ఎలాంటి కష్టమైన, కఠిన పరిస్థితులు వచ్చినా కూడా ఏమాత్రం భయపడరు. వీరికి విజయం దక్కే అవకాశాలు ఎక్కువ. వీరు తమ శత్రువులపై ప్రతీకారం తీర్చుకుంటారు.

44
మకర రాశి

కుజుడు వల్ల మకర రాశి వారికి ఎన్నో ఆశీస్సులు దక్కుతాయి. మకరంలో అంగారకుడు ఉచ్ఛస్థితిలో ఉంటాడు. దీని వల్ల వీరికి  ఓర్పు, క్రమశిక్షణ ఉంటుంది. అలాగే వీరు శారీరకంగా, మానసికంగా బలంగా ఉంటారు.  వీరు ఉద్యోగం చేసినా, వ్యాపారం చేసినా వేగంగా పురోగతి దక్కుతుంది. కాబట్టి మకర రాశి వారు లక్కీ ఫెలోస్ అనే చెప్పాలి.

Read more Photos on
click me!

Recommended Stories