Birth Date: ఈ తేదీల్లో పుట్టినవారిపై గెలవడం అంత ఈజీ కాదు..!

Published : Mar 21, 2026, 07:00 PM IST

Birth Date: మనం పుట్టిన తేదీ మన వ్యక్తిత్వాన్ని కూడా తెలియజేస్తుంది. కొన్ని తేదీల్లో పుట్టిన వారు అద్భుతమైన మనోబలాన్ని, తెలివితేటలను కలిగి ఉంటారు. వీరితో పోటీ పడటం, గెలవడం అందరికీ సాధ్యం కాదు. 

PREV
13
నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి సూర్యుడు అధిపతి. సూర్యుడు గ్రహాలకు రాజు కావడంతో, ఈ తేదీల్లో పుట్టిన వారిలో నాయకత్వ లక్షణాలు రక్తంలోనే ఉంటాయి.

వీరిపై గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే... ఈ తేదీల్లో పుట్టిన వారు ఎప్పుడూ నెంబర్ 1 స్థానంలో ఉండాలని కోరుకుంటారు. ఏదైనా పని మొదలుపెడితే అది పూర్తి అయ్యే వరకు నిద్రపోరు. వీరి ఆత్మ విశ్వాసం ముందు ప్రత్యర్థులు కూడా మోకరిల్లాల్సిందే. కష్టాల సమయాల్లో కూడా మంచి నిర్ణయాలు తీసుకోవడమే వీరి బలం. ఏ పని చేసినా అంకిత భావంతో చేస్తారు.

23
నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. వీరికి అధిపతి కుజుడు (Mars). కుజుడు అంటేనే యుద్ధ వీరుడు. ఈ తేదీల్లో పుట్టిన వారు అత్యంత సాహసవంతులు.

ఈ తేదీల్లో పుట్టిన వారిపై కూడా గెలవడం అంత ఈజీ కాదు. ఎందుకంటే... వీరు దేనికీ భయపడరు. క్లిష్ట పరిస్థితుల్లో కూడా ధైర్యంగా పోరాడుతారు. శారీరక, మానసిక శక్తి వీరిలో పుష్కలంగా ఉంటుంది. వీరు ఓటమిని ఒక పాఠంగా భావించి, రెట్టింపు ఉత్సాహంతో తిరిగి వస్తారు. వీరిలో పోరాట పటిమ ఎక్కువ. అదే వీరి బలం. అలుపెరగని శక్తితో ముందుకు దూసుకువెళతారు.

33
సంఖ్య 8 (8, 17, 26 తేదీల్లో పుట్టిన వారు)

వీరికి అధిపతి శని దేవుడు. శని ప్రభావం వల్ల వీరు అత్యంత గంభీరంగా, ఓపికగా ఉంటారు.

వీరిపై గెలవడం కూడా అంత సులభం కాదు. ఎందుకంటే.. వీరిని ఓడించడం కష్టం కావడానికి ప్రధాన కారణం వీరి 'ఓర్పు'. వీరు వ్యూహాలను చాలా రహస్యంగా వేస్తారు. బయటకు ప్రశాంతంగా కనిపిస్తూనే, సరైన సమయం కోసం వేచి చూసి విజయాన్ని అందుకుంటారు. వీరిని మానసికంగా దెబ్బతీయడం ఎవరి తరం కాదు.

వీరిని గెలవాలంటే ఏం చేయాలి?

ఈ తేదీల్లో పుట్టిన వారితో విభేదించడం కంటే, వారిని మిత్రులుగా చేసుకోవడమే లాభదాయకం. వీరి మేధస్సు, పనితనం మీ విజయానికి కూడా తోడ్పడతాయి.

Read more Photos on
click me!

Recommended Stories