Vastu Tips: ఇంటి మెయిన్ డోర్ వద్ద ఇవి ఉంటే.. లక్ష్మీదేవి ఇంట్లోకి నడుచుకుంటూ వస్తుంది..!

Published : Mar 21, 2026, 03:08 PM IST

 Vastu Tips: వాస్తు మన జీవితాలను చాలా ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటుంది. వాస్తు ప్రకారం మనం చేసే పనులే మన ఆర్థిక పరిస్థితి నిర్ణయిస్తుంది.  మెయిన్ డోర్ వద్ద  కొన్నింటిని ఉంచడం వల్ల  ఇంట్లోకి లక్ష్మీదేవి అడుగుపెడుతుంది. 

PREV
13
Vastu Tips

వాస్తు శాస్త్రం ప్రకారం ఇంటి ప్రధాన ద్వారం కేవలం ఇంట్లోకి వెళ్లడం, రావడమే కాదు.. అది సానుకూల శక్తిని, లక్ష్మీదేవి ఇంట్లోకి ప్రవేశించే మార్గం. అందుకే ఇంటి ప్రధాన ద్వారాన్ని అందంగా, వాస్తు పరంగా అలంకరించుకోవడం వల్ల ఇంట్లో సిరి సంపదలు, ప్రశాంతత నెలకొంటాయి.

23
ఇంటి మెయిన్ డోర్ వద్ద పెట్టాల్సినవి ఇవే..

1.మంగళకరమైన తోరణం..

ఇంటి గుమ్మానికి తోరణం కట్టడం అనేది మన సంప్రదాయం మాత్రమే కాదు, గొప్ప వాస్తు చిట్కా కూడా. అందుకే.. ఇంటి గుమ్మానికి తాజా మామిడి ఆకులు లేదా బంతి పూల తోరణం కట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల ఇంటికి శుభం కలుగుతుంది. ఇవి గాలిని శుద్ధి చేయడమే కాకుండా ప్రతికూల శక్తిని లోపలికి రానివ్వవు. చాలా మంది ప్లాస్టిక్ తోరణాల కంటే సహజమైన ఆకులు, పూలతో చేసినవి గుమ్మానికి కట్టడం మేలు. కుదరని పక్షంలో పంచ లోహాలు లేదా పూసలతో చేసిన తోరణాలు వాడొచ్చు.

2.వెలుతురు, దీపాలు...

చీకటిగా ఉండే ఇంటి ప్రధాన ద్వారం దారిద్య్రానికి సంకేతం. అందుకే.. ఇంటి ప్రధాన ద్వారం ఎప్పుడూ వెలుతురుతో కళకళలాడుతూ ఉండాలి. ప్రధాన ద్వారం వద్ద గుమ్మానికి ఇరువైపులా అందమైన దీపాలు అమర్చాలి. ఇలా చేయడం వల్ల వెలుతురు సానుకూల శక్తిని ఆకర్షిస్తుంది. ఇంట్లోని సభ్యుల ఆలోచనల్లో స్పష్టతను ఇస్తుంది.

3. ఉరులి, నీరు (Uruli with Water & Petals)

ఇంటి ప్రధాన ద్వారం వద్ద ఒక అందమైన ఇత్తడి లేదా మట్టి పాత్రలో (Uruli) నీరు పోసి, అందులో పూల రేకులు వేయడం అద్భుతమైన వాస్తు ఫలితాలనిస్తుంది. తలుపుకు కుడి వైపున లేదా సెంటర్లో ఉంచండి.

వాస్తు ఫలితం: నీరు ప్రశాంతతకు , సంపదకు చిహ్నం. ఇది ఇంట్లోకి వచ్చే ప్రతికూల ప్రకంపనలను గ్రహించి, ప్రశాంతమైన వాతావరణాన్ని సృష్టిస్తుంది.

33
4. లక్ష్మీ పాదాలు , స్వస్తిక గుర్తులు (Holy Symbols)

గుమ్మానికి ఇరువైపులా లేదా గుమ్మం పైన పవిత్రమైన గుర్తులను ఉంచడం వల్ల దిష్టి తగలకుండా ఉంటుంది. స్వస్తిక (Swastika), ఓం (Om) గుర్తులు లేదా లక్ష్మీ దేవి పాదాల గుర్తులు (Lakshmi Feet). ఈ గుర్తులు ఇంటికి రక్షణ కవచంలా పనిచేస్తాయి. అష్టైశ్వర్యాలను ఆహ్వానిస్తాయి.

5. ఇండోర్ ప్లాంట్స్ (Auspicious Indoor Plants)

ఇంటి ప్రధాన ద్వారం వద్ద పచ్చదనంతో కూడిన మొక్కలు ఉండటం వల్ల ప్రాణవాయువుతో పాటు సానుకూలత పెరుగుతుంది. మనీ ప్లాంట్ (Money Plant), తులసి (Tulsi) లేదా స్నేక్ ప్లాంట్ వంటివి పెంచడం ఉత్తమం.

ప్రధాన ద్వారం వద్ద ముళ్ల మొక్కలు (Cactus) లేదా ఎండిపోయిన మొక్కలను ఎప్పుడూ ఉంచకూడదు. ఇవి గొడవలకు కారణమవుతాయి.

Read more Photos on
click me!

Recommended Stories