Birth Month: ఈ నెలల్లో పుట్టిన అమ్మాయిలతో జాగ్రత్త బ్రదర్, నిండా ముంచేస్తారు..!

Published : Oct 11, 2025, 10:44 AM IST

Birth Month: జోతిష్య శాస్త్రం ప్రకారం మనం పుట్టిన తేదీ, సమయం మాత్రమే కాదు పుట్టిన నెల కూడా మన జీవితాలను చాలా ఎక్కువ ప్రభావితం చేస్తుంది. కొన్ని నెలల్లో పుట్టిన అమ్మాయిలు ప్రేమ విషయంలో చాలా కన్ఫ్యూజ్డ్ గా ఉంటారు. వీరిలో నిజాయితీ చాలా తక్కువగా ఉంటుంది.

PREV
15
Birth Month

ఈ ప్రపంచం ప్రేమ, నమ్మకం, నిజాయితీ అనే విలువలపై నడుస్తుంది. నిజాయితీ అంటే కేవలం మాటల్లోనే కాకుండా, మన చేతల్లో కూడా ఉండాలి. కానీ... ఈ రోజుల్లో నిజాయితీతో ఉండే వ్యక్తులు చాలా తక్కువ అనే చెప్పొచ్చు. మనం పుట్టిన నెల, తేదీ కూడా ఈ విషయాలను ఎక్కువ ప్రభావితం చేస్తుంది. జోతిష్య శాస్త్రం ప్రకారం, కొన్ని నెలల్లో జన్మించిన వారికి నిజాయితీ చాలా తక్కువగా ఉంటుంది. మరీ ముఖ్యంగా నాలుగు నెలల్లో జన్మించిన అమ్మాయిలు.. కేవలం తమను తాము మాత్రమే ప్రేమించుకుంటారు. తమను ప్రేమించిన వారిని నిండా ముంచేస్తారు. మరి, ఆ నెలలు ఏంటో చూద్దామా...

25
మార్చిలో జన్మించిన మహిళలు...

మార్చిలో జన్మించిన మహిళలు చాలా సాహసోపేతంగా ఉంటారు. చాలా ఆత్మవిశ్వాసం కలిగి ఉంటారు. తమ జీవితాన్ని తమకు నచ్చినట్లుగా మలుచుకుంటారు. ఈ నెలలో జన్మించిన అమ్మాయిలు కేవలం తమను మాత్రమే ప్రేమించుకుంటారు. ఎవరి మీదా ఆధారపడటానికి ఇష్టపడరు. వీరు ఎవరి ప్రేమకు లొగ్గరు. వీరిని ఎవరు ప్రేమించినా... వారు జీవితాంతం బాధపడతారు. ఎదుటివారిని అస్సలు అర్థం చేసుకోరు. మరీ ముఖ్యంగా ప్రేమ విషయంలో వీరు నిజాయితీగా ఉండరు.

35
మేలో జన్మించిన మహిళలు...

మేలో జన్మించిన మహిళల ఆలోచనలు ఎవరికీ అంత తొందరగా అర్థం కావు. వీరు ప్రతి విషయంలోనూ కన్ఫ్యూజ్ అయిపోతారు. ఏ విషయంలోనూ క్లారిటీగా నిర్ణయం తీసుకోలేరు. వీరు ప్రేమించిన వారితో జీవితాంతం సంతోషంగా ఉండలేరు. కాసేపు కావాలి అంటారు.. కాసేపు వద్దు అంటారు. వీరి కన్ఫ్యూజన్ ని ఏ అబ్బాయి కూడా తట్టుకోలేడు. ప్రేమ విషయంలో వీరు నిజాయితీగా ఉండలేరు.

45
ఆగస్టులో జన్మించిన మహిళలు....

ఆగస్టులో జన్మించిన మహిళలు ఎక్కువగా స్వతంత్రంగా ఉండాలని అనుకుంటారు. ఇతరుల నిర్ణయాలను ఫాలో అవ్వడం వీరికి నచ్చదు. తమ స్వేచ్ఛకు మాత్రమే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. ప్రేమ విషయంలో నిజాయితీ కూడా చాలా తక్కువ. అంతేకాదు.. తమ స్వేచ్ఛకు ఆటంకం కలిగింది అంటే... వారితో విడిపోవడానికి ఏ మాత్రం వెనకాడరు.

55
నవంబర్ లో జన్మించిన మహిళలు...

నవంబర్ లో పుట్టిన అమ్మాయిలు చాలా సాహసోపేతంగా ఉంటారు. జీవితంలో ఎప్పుడూ కొత్త దానిని కోరుకుంటూ ఉంటారు. వీరిని విసుగు చాలా తొందరగా వచ్చేస్తూ ఉంటుంది. ఒకరితో ఎక్కువకాలం ఉండలేరు. ప్రేమ కొంత కాలానికి వీరికి బోర్ కొడుతుంది. దీంతో... వారితో విడిపోవడానికి రెడీ అయిపోతారు.

మొత్తం మీద, ఈ నెలల్లో జన్మించిన మహిళలు నిజంగా చెడ్డవారు కాదు. కానీ వారు స్వేచ్ఛ, ఆత్మగౌరవం, వ్యక్తిగత ఎదుగుదలకే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. ప్రేమలో నిజాయితీగా, అంకిత భావంతో ఉండలేరు. ఫలితంగా తొందరగా బ్రేకప్ చెప్పేస్తూ ఉంటారు.

Read more Photos on
click me!

Recommended Stories