అభివృద్ధి..
ఇక.. పాము చెట్టు ఎక్కుతున్నట్లు కనిపిస్తే.. మీ వృత్తి లేదా వ్యాపారంలో ఉన్నత స్థాయికి చేరుకుంటారు అని దాని అర్థం.మీరు ఏదైనా విషయం గురించి తీవ్రంగా భయపడుతున్నప్పుడు లేదా.. మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు కూడా పాము కలలోకి రావచ్చు. అది మీ మనసులోని అణచివేసిన భావానలకు ప్రతిరూపం.
మార్పు (Transformation): పాము తన కుబుసాన్ని విడిచినట్లు కలలో కనిపిస్తే.. మీ జీవితంలో ఒక పాత దశ ముగిసి కొత్త మార్పు రాబోతోందని దీని అర్థం
ఏ రంగు పాము కనిపిస్తే ఏమవుతుంది?
నల్ల పాము అనారోగ్యం లేదా ఆకస్మిక సమస్యలు వచ్చే అవకాశం ఉంది. తెల్ల పాము అత్యంత శుభప్రదం. ఆధ్యాత్మిక ప్రగతి ,అదృష్టం తెస్తుందని అర్థం. బంగారు/పసుపు పాము ధన ప్రాప్తి , సంపద పెరుగుదలను సూచిస్తుంది. ఆకుపచ్చ పాము కొత్త సంబంధాలు లేదా కొత్త వ్యాపారాలు మొదలవ్వడాన్ని సూచిస్తుంది.
పరిహారాలు:ఒకవేళ పాము కలలోకి వచ్చి మీరు భయపడి నిద్రలేస్తే..మరుసటి రోజు పరమశివుడికి లేదా సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేయించడం.పాలు, పండ్లు దానం చేయడం."ఓం నమః శివాయ" అనే మంత్రాన్ని జపించడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది.