Venus Transit: రెండు రోజులు ఓపిక పడితే చాలు.. ఈ 5 రాశుల వారిపై డబ్బుల వర్షం కురవడం ఖాయం!

Published : Feb 04, 2026, 02:47 PM IST

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడి సంచారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. త్వరలో శుక్రుడు రాశి మారనున్నాడు. దానివల్ల కొన్ని రాశులవారికి అద్భుతమైన ప్రయోజనాలు కలగనున్నాయి. వ్యక్తిగత జీవితం నుంచి వ్యాపారాల వరకు పట్టిందల్లా బంగారం కానుంది. ఆ రాశులేంటో చూడండి. 

PREV
16
కుంభ రాశిలో శుక్రుడి సంచారం

జ్యోతిష్య శాస్త్రంలో శుక్రుడిని శుభ గ్రహంగా భావిస్తారు. ఒక వ్యక్తి జాతకంలో శుక్రుడు సరైన స్థానంలో ఉంటే, వారి జీవితంలో డబ్బుకు కొరత ఉండదని పండితులు చెబుతుంటారు. ఫిబ్రవరి 6న శుక్రుడు కుంభరాశిలోకి ప్రవేశించనున్నాడు. ఈ సంచారం వల్ల 5 రాశుల వారికి మేలు జరగనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇప్పుడు చూద్దాం.

26
మేష రాశి

మేషరాశికి 11వ ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు. 11వ ఇల్లు లాభ స్థానం కాబట్టి, మేషరాశి వారికి రాబోయే కొన్ని నెలలు పట్టిందల్లా బంగారం అవుతుంది. సోదరుల నుంచి మద్ధతు లభిస్తుంది. పనిచేసే చోట గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అన్నివైపుల నుంచి ఆదాయం పెరుగుతుంది. వ్యాపారంలో ఊహించని పురోగతి సాధిస్తారు. పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి వస్తుంది. కుటుంబ సమస్యలన్నీ తీరి మనశ్శాంతి కలుగుతుంది. ఆరోగ్యం చక్కగా సహకరిస్తుంది.

36
మిథున రాశి

మిథున రాశి భాగ్య స్థానంలో శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశివారికి అదృష్టం బాగా కలిసివస్తుంది. వృత్తి, వ్యాపారాల్లో విజయాలు సాధిస్తారు. గణనీయమైన లాభాలు పొందుతారు. ఈ నెల మొత్తం సానుకూలంగా సాగుతుంది. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం లభిస్తుంది. విద్యార్థులు చదువులో విజయం సాధిస్తారు. కుటుంబ జీవితం అనుకూలంగా ఉంటుంది. ప్రేమ సంబంధాలు పెళ్లిగా మారే అవకాశం ఉంది. 

46
తుల రాశి

తుల రాశికి ఐదవ ఇంట్లో శుక్రుడు సంచరించనున్నాడు. దానివల్ల ఈ రాశివారికి కుటుంబ జీవితం సంతోషంగా ఉంటుంది. పిల్లల వల్ల సంతోషం కలుగుతుంది. పిల్లల పనులు గర్వకారణంగా నిలుస్తాయి. పెళ్లి కోసం ఎదురుచూస్తున్న వారికి మంచి సంబంధాలు కుదిరే అవకాశం ఉంది. ఉద్యోగాలలో అనుకున్న టైంకి అనుకున్న విధంగా పనులు పూర్తిచేస్తారు. పిల్లలు లేని దంపతులు శుభవార్త వినే అవకాశం ఉంది. కొత్త వ్యాపారం మొదలుపెట్టడానికి ఇది అనుకూలమైన సమయం. కుటుంబంతో కలిసి టూర్లు ప్లాన్ చేస్తారు.  

56
మకర రాశి

మకర రాశి రెండో ఇంట్లో శుక్రుడు సంచరిస్తాడు. దీనివల్ల ఈ రాశివారి పలుకుబడి పెరుగుతుంది. ఈ సమయంలో కష్టానికి తగిన ఫలితాన్ని పొందుతారు. ఉద్యోగులు శుభవార్తలు వింటారు. ఆఫీస్ పని మీద విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. కోరుకున్నవి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆరోగ్యం గతంకంటే మెరుగుపడుతుంది. జీవిత భాగస్వామితో మనస్పర్థలు తొలగిపోతాయి.

66
కుంభ రాశి

కుంభ రాశి మొదటి ఇంట్లో శుక్రుడు సంచరించడం వల్ల ఈ రాశి వారికి విజయం, కీర్తి లభిస్తాయి. సంతోషం పెరుగుతుంది. భాగస్వామితో మంచి సమయం గడిపే అవకాశం లభిస్తుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. నిరుద్యోగులకు ఉద్యోగం యోగం ఉంది. కొత్త వ్యాపారం ప్రారంభించడానికి ఇది అనుకూలమైన కాలం. శుక్రుడి ప్రభావం వల్ల ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి. సంతానం కోరుకునే వారు శుభవార్తలు వింటారు. 

Read more Photos on
click me!

Recommended Stories