Sun Jupiter Yogam: సూర్య గురు గ్రహాల దృష్టి యోగం.. ఈ 4 రాశులకు లక్ మామూలుగా ఉండదు

Published : Mar 31, 2026, 10:38 AM IST

Sun Jupiter Yogam:సూర్యుడు, బృహస్పతి గ్రహాలు ఒకదానికొకటి కేంద్ర స్థానంలోకి వచ్చి కేంద్ర దృష్టి యోగాన్ని ఏర్పరుస్తారు. జ్యోతిషశాస్త్రంలో ఇది ఎంతో శుభప్రదంగా ఉంటుంది. ఈ యోగం వల్ల 4 రాశుల వారికి  విపరీతంగా కలిసివస్తుంది.

PREV
14
మిథున రాశి

మిథున రాశి వారికి సూర్య, గురు గ్రహాల వల్ల ఏర్పడే కేంద్ర దృష్టి యోగం ఎంతో బాగా కలిసివస్తుంది. అదృష్టాన్ని తెస్తుంది. వీరికి ఉన్న ఆర్థిక ఇబ్బందులన్నీ తొలగిపోతాయి. సమయానికి డబ్బు చేతికి అందుతుంది. ఆస్తి సంబంధిత సమస్యలతో బాధపడేవారు వాటి నుంచి బయటపడి ప్రశాంతంగా ఉంటారు. వీరికి కెరీర్‌లో కొత్త అవకాశాలు వచ్చే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. ఏదైనా పుణ్యక్షేత్రానికి,  తీర్ణ యాత్రకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి.

24
కన్యా రాశి

సూర్య-గురు గ్రహాల వల్ల కేంద్ర దృష్టి యోగం కన్యారాశి ఎంతో మేలు చేస్తుంది. పాత కాలంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు వస్తాయి. వ్యాపారం చేసేవారికి ఆ  వ్యాపారాన్ని విస్తరించేందుకు ఈ కాలం బాగా కలిసిసొస్తుంది. ముఖ్యంగా గురు గ్రహానికి సంబంధించిన బంగారం, వెండి, విద్యాసంబంధిత వ్యాపారాలు చేసేవారికి బాగా కలిసివస్తుంది. ఈ రాశి వారికి లేదా వీరి తండ్రికి ఆరోగ్య సమస్యలుంటే తగ్గుతాయి.

34
ధనూ రాశి

ధనుస్సు రాశి వారికి ఈ యోగం వల్ల అద్భుతమైన ప్రయోజనాలను దక్కే అవకాశం ఉంది. వీరి మనసులో ఎప్పటినుంచో ఉన్న కోరికలు తీరిపోతాయి. అలాగే ధనలాభాలు కూడా కలుగుతాయి. వీరి జీవితంలో సుఖసంతోషాలు పెరుగుతాయి. మీరు అనుకున్న పనులు ప్రణాళికలు విజయవంతమవుతాయి. కొత్త పని ప్రారంభించడానికి ఇది మంచి కాలమనే చెప్పాలి.

44
మీన రాశి

మీన రాశి వారికి సూర్యు గురు గ్రహాల కేంద్ర దృష్టి యోగం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. మీరు ఎదుర్కొంటున్న పెద్ద సమస్యల నుంచి పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి తోటి సహోద్యోగుల నుంచి సహాయం అందుతుంది. అవసరానికి డబ్బు చేతికి వస్తుంది. కెరీర్‌లో సానుకూల మార్పులు కనిపిస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories