వేద జోతిష్యశాస్త్రం ప్రకారం, తెలివితేటలు, వ్యాపారాలకు బుధ గ్రహం అధిపతి. ఈ బుధ గ్రహం ప్రస్తుతం కుంభ రాశి ఉన్నాడు. ఏప్రిల్ 11వ తేదీన మీన రాశిలోకి అడుగుపెడుతుంది. బుధుడు ఈ రాశిలోకి అడుగుపెట్టడం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ప్రభావం కలిగించొచ్చు. కానీ, ఈ రాశికి అధిపతి అయిన గురు గ్రహం కేంద్ర స్థానంలో అనుకూల స్థితిలో ఉన్నాడు. దీని కారణంగా శక్తివంతమైన నీచభంగ రాజయోగం ఏర్పడుతుంది. ఈ రాజయోగం మూడు రాశుల వారికి అదృష్టాన్ని మోసుకురానుంది. ఈ మూడు రాశులకు వృత్తి, వ్యాపారాల్లో పురోగతి సాధించగలరు. మరి, ఆ రాశులేంటో చూద్దాం...