Shani: మే 15 నుంచి ఈ మూడు రాశుల వారి జీవితంలో కీలక మార్పులు.. శనిదేవుడి ప్రభావం

కర్మలకు న్యాయనిర్ణేత అయిన శని దేవుడిని న్యాయమైన దేవుడు అని పిలుస్తారు. శని దేవుడు ప్రజలకు వారి కర్మల ప్రకారం ఫలితాలను ఇస్తాడు. ప్రతి ఒక్కరికీ వారి వారి కర్మల ప్రకారం ఫలాలను ఇచ్చేవాడు. శని దృష్టి నుంచి ఎవరూ తప్పించుకోలేరు. ఏప్రిల్‌ 15, 2025 ఒక ప్రత్యేకమైన రోజు. ఈ రోజున ఏర్పడిన గ్రహ యోగాలలో సిద్ధి యోగం ఒకటి. మంగళవారం నుంచి శని ప్రభావం మూడు రాశులపై పడనుంది. వీరి జీవితంలో కీలక మార్పులు మొదలు కానున్నాయి. ఇంతకీ ఆ రాశుల వారి జీవితంలో జరిగే మార్పులు ఏంటంటే.. 
 

Significant changes in the lives of three zodiac signs due to the influence of Shani in telugu VNR

అత్యంత నెమ్మదిగా ప్రయణించే గ్రహం శని గ్రహం. శని ఒక్కో రాశిలో రెండున్నర సంవత్సరాలు ఉంటుంది. ప్రతీ మనిషి జీవితంపై శని ప్రభావం ఉంటుందని వాస్తు పండితులు చెబుతుంటారు. అందుకే శని ప్రభావం కారణంగా జీవితంలో కష్ట సమయాన్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అయితే ఏలినాటి శని సమయంలో కష్టం అంటే ఏంటి.? జీవితంలో మనవారు ఎవరు.? శత్రవులు ఎవరు అనే విషయాన్ని బోధిస్తాడని అంటారు. మే 15వ తేదీ నుంచి మూడు రాశుల వారు జాగ్రత్తగా ఉండాలని పండితులు చెబుతున్నారు. ఈ మూడు రాశులు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 
 

Significant changes in the lives of three zodiac signs due to the influence of Shani in telugu VNR
Aquarius

కుంభ రాశి:

కుంభ రాశి వ్యక్తుల ఉద్యోగ జీవితంలో మార్పులు ఉండే అవకాశం ఉంది. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు జాగ్రత్తగా ఆలోచించండి. సోమరితనాన్ని వదిలివేసి, మీ జీవితంలో క్రమశిక్షణను అలవర్చుకోండి. ఈ సమయంలో, మీపై కుటుంబ బాధ్యతలు పెరగవచ్చు. ఈ రాశి వారు శనిమంత్రాన్ని జపించాలి. “ఓం శం శనైశ్చరాయ నమః” అని క్రమం తప్పకుండా జపిస్తే మంచి ఫలితం ఉంటుంది. 
 


Pisces Zodiac

మీన రాశి:

శని మీన రాశిలో సంచారము చేస్తున్నాడు. ఇది మీన రాశి వారికి కష్టకాలం. ఈ సమయంలో మీ మనోధైర్యం పరీక్షిస్తుంది. ఖర్చులపై నియంత్రణ ఉంచండి. మీ మాటల్లో వినయాన్ని పాటించండి.  మీ స్వభావాన్ని మార్చుకోవడానికి ప్రయత్నించండి, కోపానికి దూరంగా ఉండండి. పరిహారం- శనివారం రావి చెట్టుకు నీళ్లు పోసి, ఆవ నూనెతో దీపం వెలిగించండి.
 

సింహ రాశి:

 సింహ రాశి వారికి మానసిక ఒత్తిడిని కలిగిస్తుంది. మీ పనిలో అనేక అంతరాయాలు, సమస్యలు తలెత్తవచ్చు. ఈ రాశి వారు కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది. ఏ పనిలోనైనా తొందరపడటం మానుకోండి. పరిహారం- ప్రతి శనివారం పేదలకు నల్లటి వస్తువులను దానం చేయండి. 

Latest Videos

vuukle one pixel image
click me!