Shani: ఈ మూడు రాశుల తలరాత పూర్తిగా మార్చేయనున్న శని, అదృష్టం పెరుగుతుంది..!

Published : Nov 04, 2025, 05:22 PM IST

Shani : శని ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. కానీ, స్థానాలను మార్చుకుంటూ ఉంటాడు. ఆ ప్రభావం అన్ని రాశులపై పడుతూ ఉంటుంది. 2026లో శని ప్రభావం మూడు రాశులపై పడనుంది. 

PREV
14
శని గ్రహ మార్పు...

శని గ్రహం ప్రస్తుతం మీన రాశిలో ఉన్నాడు. అదే రాశిలో ఉంటూ... నక్షత్రాన్ని మార్చుకోనున్నాడు. 2026 ప్రారంభంలో శని పూర్వాభాద్రపద నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. తర్వాత ఉత్తరభాద్రపద నక్షత్రంలోకి అడుగుపెట్టనున్నాడు. ఈ నక్షత్ర మార్పు... మూడు రాశులపై పడనుంది. ఆ మూడు రాశుల తలరాత మారనుంది. అదృష్టం పెరగనుంది. మరి, ఆ మూడు రాశులేంటో చూద్దామా....

24
1.మేష రాశి...

మేష రాశివారు జీవితంలో చాలా ఎక్కువగా కష్టపడే మనస్తత్వం కలిగి ఉంటారు. 2026లో మేష రాశివారు కష్టానికి తగిన ప్రతిఫలం పొందుతారు. కెరీర్ లో పురోగతి సాధిస్తారు. అయితే.. కెరీర్ లో ఉన్నత స్థానానికి వెళ్లామనే పొగరు మాత్రం పెంచుకోకూడదు. అహంకారం దెబ్బతీస్తుంది. మీరు మీ సహోద్యోగులతో మంచి సంబంధాలను కొనసాగించాలి. ఈ సంవత్సరం ఆర్థికపరంగా చాలా బాగుంటుంది. కానీ, ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. ఏ నిర్ణయం తీసుకున్నా... ప్రశాంతంగా ఆలోచించి తీసుకోవాలి.

34
2.కుంభ రాశి...

కుంభ రాశివారి ఏలినాటి శని చివరి దశ కొనసాగుతోంది. ఈ సమయంలో మానసిక ఒత్తిడి పెరిగే అవకాశం ఉంది. కానీ, అనేక బాధ్యతలు ఒకేసారి నిర్వహించాల్సి ఉంటుంది. కానీ, మీరు ముందుగానే ప్లాన్ చేసుకుంటే.. ప్రతిదీ సాధ్యమౌతుంది. 2026లో కుంభ రాశివారు కెరీర్ లో విజయాలను సాధించగలరు. సమస్యలను వదిలేసి... పనిపై దృష్టి పెట్టాలి. కుటుంబ సభ్యులతో గొడవలను నివారించాలి. కోపం తగ్గించుకోవాలి. కఠినమైన మాటలు సంబంధాలను నాశనం చేస్తాయి. కాబట్టి, ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

44
3.మీన రాశి...

మీన రాశివారికి 2026 సంవత్సరం మిశ్రమంగా ఉంటుంది. శని గ్రహం మీన రాశిలోనే ఉన్నాడు. కాబట్టి ఈ సమయం చాలా ముఖ్యం. పని ఒత్తిడి పెరుగుతుంది. మానసికంగా సమస్యలు రావచ్చు. కానీ, మీరు సరైన మార్గంలో ఉంటే... శని కూడా మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అంటే.. మీరు చేసే పనులను బట్టే.. మీ జీవితం ఆధారపడి ఉంటుంది. చెడు అలవాట్లకు దూరంగా ఉండాలి. ఓపికగా ఉంటే.. జీవితంలో ఉన్నత స్థానాన్ని చేరుకునే అవకాశం ఉంది. శని మీ రాశిలోనే ఉన్నాడు అని భయపడకండి... మీరు మంచి మార్గంలో నడిస్తే... మీకు అంతా మంచే జరుగుతుంది. కష్ట సమయాల్లో నిజాయితీతో కష్టపడి పని చేసే వారికి శని ఎలాంటి హాని చేయడు. కాస్త ఓపిక పడితే.. మంచి రోజులు తిరిగి వస్తాయి.

Read more Photos on
click me!

Recommended Stories