డిసెంబర్ 7 వరకు ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు.. అన్నీ ప్రతికూల ఫలితాలే!

Published : Nov 04, 2025, 04:31 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం నవంబర్ 3న కుజుడు, రాహువుల కలయిక జరిగింది. ఈ ప్రభావం వల్ల ఏర్పడిన అంగారక యోగం.. కొన్ని రాశులవారికి ప్రతికూల ఫలితాలు ఇవ్వనుంది. దాదాపు నెలరోజుల పాటు ఆ రాశులవారు చాలా జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.   

PREV
14
అంగారక యోగం

జ్యోతిష్యం ప్రకారం కుజుడు, రాహువు, కొన్ని సందర్భాల్లో కేతువు కలిసి ఉండటం వల్ల అంగారక యోగం ఏర్పడుతుంది. కుజుడు ధైర్యం, కోపం, పరాక్రమానికి కారకుడు. రాహు, కేతువులను భ్రమ, గందరగోళం, అత్యాశ, మార్పులకు కారకులుగా భావిస్తారు. ప్రస్తుతం కుజుడు మకరరాశి 11వ ఇంట్లో సంచరిస్తున్నాడు. కుంభరాశిలో సంచరిస్తున్న రాహువుతో అంగారక యోగాన్ని ఏర్పరుస్తున్నాడు. ఈ యోగం వల్ల కొన్ని రాశుల వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. ఆ రాశులేంటో.. వారికి కలిగే ఇబ్బందులేంటో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

24
కర్కాటక రాశి

డిసెంబర్ 7 వరకు కర్కాటక రాశి వారికి ప్రతికూల ఫలితాలు ఉంటాయి. అంగారక యోగం వల్ల తీవ్రంగా నష్టపోవచ్చు. అనవసరమైన గొడవలు, వివాదాలు రావచ్చు. పని ప్రదేశంలో వాదనల వల్ల ఒత్తిడి పెరుగుతుంది. వాహనాలు నడిపేటప్పుడు, నిప్పు లేదా ఆయుధాలు వాడేటప్పుడు ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. కుటుంబంలో కూడా సమస్యలు, విభేదాలు రావచ్చు. ఇంటి పెద్దల ఆరోగ్యం దెబ్బతినొచ్చు. కాబట్టి ఈ రాశివారు జాగ్రత్తగా ఉండటం మంచిది. 

34
మకర రాశి

అంగారక యోగం ప్రభావం మకర రాశివారిపై తీవ్రంగా ఉంటుంది. కాబట్టి ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర గొడవలు, వాదనలు, సంబంధాల్లో చీలికలు రావచ్చు. మనసు ఆందోళనగా ఉంటుంది. దానివల్ల తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు. ఆలోచించకుండా తీసుకునే నిర్ణయాల వల్ల నష్టపోతారు. కాబట్టి డిసెంబర్ 7 వరకు ఈ రాశివారు కాస్త శాంతంగా వ్యవహరించాలి. మాటల్లో ఓర్పు అవసరం. గర్భిణులు, పిల్లలు మరింత జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య పండితులు సూచిస్తున్నారు.

44
కుంభ రాశి

అంగారక యోగం కుంభరాశి వారికి చాలా సమస్యలు తెస్తుంది. కుజుడి సానుకూల శక్తి అయిన ధైర్యం, చురుకుదనం పక్కదారి పట్టి కోపం, దూకుడు, ఆవేశం పెరుగుతాయి. భూ సంబంధిత వివాదాల్లో చిక్కుకోవచ్చు. కుటుంబ జీవితంలో అశాంతి, జీవిత భాగస్వామితో గొడవలు రావచ్చు. బంధువుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఆర్థికంగా ఇబ్బందులు రావచ్చు. అంతేకాదు రక్తం, చర్మ వ్యాధులు, శరీర వేడికి సంబంధించిన సమస్యలు ఇబ్బంది పెట్టవచ్చు. కాబట్టి కొద్దిరోజులపాటు ఈ రాశివారు శాంతంగా ఉండటం మంచిది. 

గమనిక

ఈ సమాచారం పాఠకుల ఆసక్తిమేరకు జ్యోతిష్య నిపుణుల సలహాలు, సూచనల ఆధారంగా అందించింది మాత్రమే.

Read more Photos on
click me!

Recommended Stories