Zodiac Signs: శని వక్ర గమనం.. దీపావళి వరకు ఈ 3 రాశులకు కష్టాలు తప్పవు!

Published : Jul 15, 2025, 01:29 PM IST

జ్యోతిష్య శాస్త్రంలో శని గమనానికి చాలా ప్రాధాన్యం ఉంది. ప్రస్తుతం శని వక్రగతిలో ఉన్నాడు. మీన రాశిలో శని వక్రగతి వల్ల కొన్ని రాశులవారికి చెడు జరిగే అవకాశం ఉంది. మరి ఆ రాశులేంటో వారు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ఇక్కడ చూద్దాం.   

PREV
14
శని వక్రగతి ప్రభావం..

జూలై 13న శని వక్రగతిలోకి వెళ్లాడు. ఇది దాదాపు 4 నెలలు కొనసాగనుంది. శని సంవత్సరానికి ఒకటి లేదా రెండు సార్లు వక్రగతి చెందుతాడు. మీనరాశిలో శని వక్రగతి వల్ల కొన్ని రాశులవారు జాగ్రత్తగా ఉండాలని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. శని వక్రగతి వల్ల కొన్ని రాశులవారు ఆర్థిక ఇబ్బందులు, సంబంధాల సమస్యలు, ఆరోగ్యం, వృత్తి జీవితంలో అసంతృప్తిని ఎదుర్కొంటారట. ఆ రాశులేంటో చూద్దామా..

24
మేష రాశి వారిపై శని వక్రగతి ప్రభావం..

మేషరాశి వారికి శని 12వ ఇంట్లో వక్రగతిలో ఉన్నాడు. ఇది కొన్ని ఇబ్బందులను కలిగిస్తుంది. ఈ రాశివారు అవసరానికి మించి ఆలోచించకూడదు. మిమ్మల్ని మీరు దృఢంగా ఉంచుకోవడానికి ధ్యానం, మంత్ర జపంపై దృష్టి పెట్టాలి. ఈ సమయంలో మేషరాశి వారికి ఖర్చులు పెరుగుతాయి. 

34
మిథున రాశి

శని వక్రగతి కారణంగా మిథునరాశి వారు తమ వృత్తి జీవితంలో నిరాశను ఎదుర్కోవాల్సి ఉంటుంది. గుర్తింపు లేని పనికోసం మీపై ఒత్తిడి పెరుగుతుంది. మిథునరాశి 10వ ఇంట్లో శని వక్రగతిలో ఉన్నాడు. ఉద్యోగంలో షార్ట్‌కట్‌లను ఉపయోగించవద్దు. మిమ్మల్ని మీరు అప్‌గ్రేడ్ చేసుకోండి. శని ముఖ్యంగా మీ దీర్ఘకాలిక లక్ష్యాలు, వృత్తిపై ప్రభావం చూపుతాడు.

44
సింహ రాశి

సింహరాశి 8వ ఇంట్లో శని వక్రగతిలో ఉన్నాడు. ఈ రాశి వారు సన్నిహిత సంబంధాల్లో ఒత్తిడిని ఎదుర్కోవాల్సి రావచ్చు. మీరు మీ ఆర్థిక పరిస్థితిపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. డబ్బును తెలివిగా ఖర్చు చేయాలి.

Read more Photos on
click me!

Recommended Stories