Planets Retrograde: జ్యోతిష్య శాస్త్రంలో శని, రాహు, కేతువుల సంచారానికి చాలా ప్రాధాన్యం ఉంటుంది. ప్రస్తుతం ఈ 3 గ్రహాలు వక్రగమనంలో ఉన్నాయి. దానివల్ల 6 రాశులవారి జీవితాల్లో అనేక సవాళ్లు ఎదురయ్యే సూచనలు ఉన్నాయి. మరి ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, గ్రహాల కదలికలు, రాశిమార్పు, వక్ర సంచారం వంటివి ప్రతి రాశిపై ప్రభావం చూపుతాయి. ప్రస్తుతం శని, రాహు, కేతు గ్రహాల వక్ర గమనంలో ఉన్నాయి. ఈ గ్రహ స్థితి వల్ల 6 రాశులవారు కొన్ని సవాళ్లు ఎదుర్కోవాల్సి రావచ్చు. మరి ఆ రాశులేవి? వాళ్లు ఏ విషయంలో జాగ్రత్తగా ఉండాలి? వంటి విషయాలు ఇక్కడ తెలుసుకుందాం.
27
వృషభ రాశి
వృషభ రాశి వాళ్లు వచ్చే నెల రోజులు ఆర్థిక, కెరీర్ విషయాల్లో చాలా జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గించుకుని, ఆదాయానికి తగ్గట్టుగా డబ్బు ఖర్చు చేయడం మంచిది. కొత్త పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడకూడదు. ఆఫీసులో మీకు కొన్ని అదనపు బాధ్యతలు రావచ్చు. ఇంట్లో చిన్న చిన్న గొడవలు వచ్చినా సర్దుకుపోవడం వల్ల బంధాలు బలపడతాయి.
37
కన్య రాశి
కన్య రాశి వాళ్లకు ఈ నెలలో ఖర్చులను ప్లాన్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఊహించని ఖర్చులు వచ్చే అవకాశం ఉంది కాబట్టి, చేతిలో ఉన్న డబ్బును జాగ్రత్తగా వాడుకోవాలి. అప్పులు చేయకుండా ఉండటం, ఇతరులకు తొందరపడి డబ్బులు ఇవ్వకపోవడం మంచిది. ఉద్యోగం కోసం చూస్తున్న వాళ్లకు కొత్త అవకాశాలు దొరకొచ్చు. ఇప్పటికే జాబ్ చేస్తున్న వాళ్లు తమ టాలెంట్ చూపించడానికి దొరికే ఛాన్సులను వాడుకోవాలి. ఇంట్లో వాళ్లతో ఓపికగా మాట్లాడితే అనవసర గొడవలను ఆపొచ్చు.
మిథున రాశి వాళ్లకు వృత్తి, వ్యాపారాల్లో కొన్ని మార్పులు రావచ్చు. ఆశించిన లాభాలు రావడం లేట్ అయినా ధైర్యం కోల్పోకూడదు. కొత్త బిజినెస్ మొదలుపెట్టే ముందు కాస్త అనుభవం ఉన్న వాళ్ల సలహాలు తీసుకోవడం మంచిది. జీవిత భాగస్వామితో చిన్న చిన్న మనస్పర్థలు వచ్చే ఛాన్స్ ఉంది. ఒకరినొకరు అర్థం చేసుకుని ముందుకు వెళ్లడం చాలా ముఖ్యం. ఆరోగ్యాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయకూడదు.
57
తుల రాశి
తుల రాశి వాళ్లు వచ్చే నెల రోజులు చాలా ఓపికగా ఉండాల్సిన టైమ్. ముఖ్యంగా డబ్బుకి సంబంధించిన నిర్ణయాల్లో అస్సలు తొందరపడకూడదు. కొత్త పెట్టుబడులు, ఆస్తులు కొనడం, అమ్మడం లాంటి విషయాల్లో పేపర్స్ అన్నీ సరిగ్గా చూసుకున్న తర్వాతే ముందడుగు వేయాలి. ఆఫీసులో కొన్ని అడ్డంకులు వచ్చినా మీ ప్రయత్నాలు మాత్రం ఆపకూడదు. దూర ప్రయాణాలు చేసేటప్పుడు ముందే ప్లాన్ చేసుకోవడం మంచిది. ఇంట్లో వాళ్ల సపోర్ట్ మీకు చాలా ప్రశాంతతను ఇస్తుంది.
67
మకర రాశి
మకర రాశి వారికి కష్టానికి తగ్గ ఫలితం దక్కడంలో కొంచెం ఆలస్యం జరుగుతుంది. అయినా మీ ప్రయత్నాలు ఆపకుండా కొనసాగిస్తే సక్సెస్ సొంతం అవుతుంది. జాబ్, బిజినెస్‌లలో కొత్త బాధ్యతలు రావచ్చు. వాటిని కరెక్ట్‌గా వాడుకుంటే ఫ్యూచర్‌లో మంచి పురోగతి ఉంటుంది. ఆదాయం బాగానే ఉన్నా ఇంటి ఖర్చులు విపరీతంగా పెరగొచ్చు. ఇంట్లో పెద్దవాళ్ల సలహాలు విని నడుచుకోవడం చాలా మంచిది.
77
కుంభ రాశి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. కుంభ రాశి వాళ్లకు ఈ టైమ్‌లో బిజినెస్, ఫైనాన్స్, పర్సనల్ లైఫ్‌లో కొన్ని మార్పులు వస్తాయి. ఆదాయం పెరిగేందుకు కొత్త ఛాన్సులు వచ్చినా.. వాటిని ఎంచుకునే విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులను తగ్గించుకుని డబ్బు సేవ్ చేయడానికి ట్రై చేయాలి. ఆఫీసులో కొత్త పనులు అప్పగించొచ్చు. మీ టాలెంట్, ఎక్స్‌పీరియన్స్‌ని కరెక్ట్‌గా చూపిస్తే మంచి పురోగతి చూస్తారు. ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయడం వల్ల కాస్త ప్రశాంతత లభిస్తుంది.