కుంభ రాశికి అధిపతి శని దేవుడు. శని దేవుడికి పరమశివుడే గురువు కాబట్టి, కుంభ రాశి వారిపై కూడా మహాదేవుడి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయి. వీరు ఇతరులకు సహాయం చేయడంలో ముందుంటారు. శివుడి అనుగ్రహం వల్ల వీరికి జీవితంలో ఊహించని విజయాలు, అదృష్టం కలిసి వస్తాయి. కష్టకాలంలో వీరికి ఏదో ఒక రూపంలో దైవ సహాయం అందుతూనే ఉంటుంది.
చిన్న పరిహారం: ఈ రాశుల వారు ప్రతి సోమవారం శివాలయానికి వెళ్లి పంచామృతాలతో అభిషేకం చేయడం లేదా 'ఓం నమః శివాయ' పంచాక్షరీ మంత్రాన్ని జపించడం వల్ల జీవితంలో సకల శుభాలు కలుగుతాయి.