Shani Mercury Conjunction: ముప్పై ఏళ్ల తర్వాత శని బుధుల కలయిక.. ఈ రాశులకు ఇక తిరుగుండదు!

Published : Nov 21, 2025, 11:53 AM IST

Shani Mercury Conjunction:  జ్యోతిషం ప్రకారం  2026లో బుధుడు  శని గ్రహాలు ముప్పై ఏళ్ల తరువాత కలవబోతున్నారు. దీని వల్ల కొన్ని రాశుల వారికి విపరీతంగా కలిసివస్తుంది. ఆ రాశుల్లో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

PREV
14
శని బుధ కలయిక

జ్యోతిష్య శాస్త్రంలో శని బుధు గ్రహాలు చాలా ముఖ్యమైనవవి. శని కర్మ ఫలాలను అందించే దేవుడు.  బుధుడు తెలివికి, చదువుకు, వ్యాపారానికి కారకుడు. ఈ రెండు గ్రహాలు కొత్త ఏడాదిలో  మీనరాశిలో కలవబోతున్నారు. 30 ఏళ్ల తర్వాత ఈ కలయిక జరగబోతోంది. ఇది కొన్ని రాశుల వారి అదృష్టాన్ని తీసుకురాబోతోంది. ఆ రాశులలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి.

24
మీన రాశి

బుధుడు, శని కలయిక మీన రాశి వారికి కలిసొచ్చేలా చేస్తుంది. ఈ కలయిక మీన రాశి వారి లగ్నంలో జరుగుతుంది. దీని వల్ల ఈ రాశి వారిలో ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.  గౌరవ మర్యాదలు పెరుగుతాయి. ఇక పెళ్లయిన వారి జీవితం ఆనందంగా సాగుతుంది. పెళ్లి కానికి వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశం ఉంది. ఈ రాశి వారు వ్యాపారంలో ఎంతో పురోగతి సాధిస్తారు. ఈ సమయంలో ఆదాయం పెరిగేందుకు అన్ని అవకాశాలు లభిస్తాయి.

34
వృషభ రాశి

వృషభ రాశి వారికి బుధ, శని కలయిక ఎంతో కలిసివస్తుంది. ఈ రెండు రాశుల కలయిక మీ రాశిలోని 11వ ఇంట్లో జరగబోతోంది. కాబట్టి మీ ఆదాయం పెరిగే అవకాశాలు అధికంగా ఉన్నాయి. ఈ సమయంలో కొత్త ఆదాయ మార్గాలు పెరుగుతాయి. పాత పెట్టుబడుల నుంచి లాభాలు పొందే అవకాశం పెరుగుతోంది. ఉద్యోగ జీవితంలో ఈ రాశి వారికి విపరీతమైన గౌరవంపెరుగుతాయి. ఎన్నో రకాల ఆర్ధిక లాభాలు కలిగే అవకాశం ఉంది.

44
మకర రాశి

మకర రాశి వారికి బుధ, శని కలయిక ఎంతో కలిసివచ్చేలా చేస్తుంది. ఈ రాశి వారి రెండవ ఇంట్లో బుధుడు, శని కలయిక జరుగుతుంది. ఇది మీకు ఎంతో అనుకూలంగా ఉంటుంది.  ఈ సమయంలో మీరు కొత్త వ్యక్తులను కలిసే అవకాశాలు లభిస్తాయి.  ఇక రచన, కమ్యూనికేషన్, మీడియా వంటి రంగాలలో ఉన్నవారికి ఇది బాగా కలిసొచ్చే సమయం. మీ ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయి. కొత్త ఉద్యోగం లభించే అవకాశాలు కనిపిస్తున్నాయి. వాహనం లేదా ఆస్తులు కొనుగోలు చేసే ఛాన్స్ అవకాశం ఉంది. 

Read more Photos on
click me!

Recommended Stories