నవ పంచమ రాజయోగం..
జ్యోతిష్యం ప్రకారం గ్రహాలు కాలానుగుణంగా రాశులను మారుస్తుంటాయి. శుభ, అశుభ యోగాలను సృష్టిస్తుంటాయి. వాటి ప్రభావం అన్ని రాశిచక్రాలపై పడుతుంది. అక్టోబర్‌లో గురువు తన ఉచ్ఛ రాశి కర్కాటకంలోకి ప్రవేశిస్తాడు, శనితో కలిసి నవపంచమ రాజయోగాన్ని ఏర్పరుస్తాడు. దీంతో కొన్ని రాశులవారికి అదృష్టం ప్రకాశిస్తుంది. వీరు ఉద్యోగ, వ్యాపారాల్లో లాభాలు పొందుతారు. దేశ, విదేశ యాత్రలు చేస్తారు. మరి ఆ అదృష్ట రాశులేంటో తెలుసుకుందామా...