శని ప్రభావం.. బంధాల్లో బీటలు, విడాకులు పెరిగే అవకాశం. 4 రాశుల వారు జాగ్ర‌త్త

Published : Nov 27, 2025, 12:12 PM IST

Shani Effect: వ‌చ్చే ఏడాది శ‌ని ప్ర‌భావం కార‌ణంగా ఇబ్బందులు వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా మాన‌వ సంబంధాల‌పై ఎక్కువ ప‌డుతుంద‌ని అంటున్నారు. ఏయే రాశుల‌పై ఎలాంటి ప్ర‌భావం ప‌డ‌నుందో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
2026లో శని మార్పు ఉండదు కానీ ప్రభావం

2026 కొత్త ఏడాదిలో శనిగ్రహం ఎలాంటి రాశి మార్పు చేయడం లేదు. శని మీన రాశిలోనే రాశిలోనే కొనసాగుతుంది. రాశి మార్పు లేకపోయినా, శని స్థానం మనుషుల భావాలు, ఆలోచనలు, సంబంధాలపై పెద్ద‌గా ప్రభావం చూపుతుంది. ఈ ఏడాదిలో ప్రజలు మాట్లాడేది తక్కువ, ఆలోచించేంత ఎక్కువ. నమ్మకం తగ్గి, అనుమానాలు పెరగవచ్చు. ప్రేమ తగ్గి, సంబంధాల్లో దూరం పెరగడం కూడా కనిపిస్తుంది.

25
భావోద్వేగాలు కఠినమవుతాయి

శని జల తత్త్వ రాశులపై ప్రభావం చూపితే, భావోద్వేగాల ప్రవాహం అడ్డుకట్టవుతుంది. 2026లో ఇదే ఎక్కువగా కనిపిస్తుంది. ప్రజలు చిన్న విషయాలకే బాధపడుతారు కానీ బయటకు చెప్పరు. భావాలు లోపలే పోగవుతాయి, దీనివల్ల మానసిక ఒత్తిడి పెరుగుతుంది. ఇది కొందరికి మానసికంగా బలహీనత, ఒత్తిడి, దిగులుగా మారవచ్చు.

35
కుటుంబాల్లో మౌనం పెరుగుతుంది

2026లో కుటుంబ జీవితం పెద్ద పరీక్షలాంటి ఉంటుంది. భార్య‌భ‌ర్త‌ల మ‌ధ్య దూరం పెరిగే అవ‌కాశాలు ఉన్నాయి. తల్లిదండ్రులు, పిల్లల మధ్య అపోహలు పెరుగుతాయి. ఇంట్లో సంతోషం త‌గ్గుతుంది. శని ప్రభావం వ‌ల్ల‌ కుటుంబాల్లో భావోద్వేగ బంధాలు సడలే ప్రమాదం ఉంది.

45
బ్రేకప్, విడాకులు పెరిగే ప్రమాదం

శుక్రగ్రహం ప్రేమ, సంబంధాలు, ఆకర్షణను చూపుతుంది. 2026లో శని శుక్రాన్ని ప్రభావితం చేస్తుంది. దీంతో ప్రేమ తగ్గిపోవడం, భాగస్వామితో దూరం పెర‌గ‌డం, చిన్న విషయాలు పెద్ద గొడవలుగా మారడం, అపార్థాలు పెరిగే అవ‌కాశం ఉంటుంది. కొన్ని సంద‌ర్భాల్లో విడాకుల వ‌ర‌కు వెళ్లొచ్చు.

55
4 రాశుల వారు జాగ్రత్తగా ఉండాలి

2026లో శని బాధ్యతలను పెంచి, ఆర్థిక ఒత్తిడిని తీసుకురావచ్చు. డబ్బు కారణంగా కుటుంబాల్లో తగాదాలు పెరగవచ్చు. భావోద్వేగాలు, ఆర్థిక ఒత్తిడి కలిసి సంబంధాలను మరింత కఠిన పరిస్థితిలోకి నెడతాయి. 2026లో శని ఎక్కువగా ప్రభావితం చేసే 4 రాశులు ఇవే..

కర్కాటకం – భావోద్వేగ ఒత్తిడి

మీనం – మానసిక అలసట

తుల – సంబంధాల్లో పరీక్ష

ధనుసు – కుటుంబ బాధ్యతలు, ఆర్థిక ఒత్తిడి

గమనిక: పైన తెలిపిన వివరాలు ఇంటర్నెట్ లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా అందించడమైంది. వీటిలో ఎలాంటి శాస్త్రీయ ఆధారాలు లేవని రీడర్స్ గమనించాలి. 

Read more Photos on
click me!

Recommended Stories