Zodiac Signs: శని, చంద్రుల కలయిక.. ఈ మూడు రాశులకు అన్నీ శుభ ఫలితాలే!

Published : Aug 10, 2025, 03:46 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాల రాశి మార్పు ఎప్పుడూ జరుగుతూనే ఉంటుంది. నేడు (ఆదివారం) చంద్రుడు.. శని గ్రహానికి సంబంధించిన రాశిలోకి ప్రవేశించాడు. చంద్ర, శనిల కలయిక మూడు రాశులవారికి మేలు చేస్తుంది. ఆ రాశులేంటో ఓసారి చూసేయండి.    

PREV
14
కుంభ రాశిలోకి చంద్రుడు

జ్యోతిష్య నిపుణుల ప్రకారం ఈ రోజు(ఆదివారం) చాలా ప్రత్యేకమైనది. ఈ రోజు ఉదయం చంద్రుడు మకర రాశిని వదిలి కుంభ రాశిలోకి ప్రవేశించాడు. కుంభ రాశిలో చంద్రుడి సంచారం చాలా ప్రత్యేకమైనది. ఎందుకంటే చంద్రుడు.. కర్మఫలాలను ఇచ్చే శని గ్రహానికి సంబందించిన రాశిలోకి ప్రవేశించాడు. దీనివల్ల మూడు రాశులవారికి శుభ ఫలితాలు ఉన్నాయి. మరి ఆ రాశులేంటో.. అందులో మీ రాశి కూడా ఉందో తెలుసుకోండి.

24
మిథున రాశి

చంద్రుని రాశిమార్పు వల్ల మిథున రాశి వారి జీవితంలో సానుకూల ఫలితాలు ఉంటాయి. ఇంట్లో ఉన్న సమస్యలు తీరిపోవడంతో మనశ్శాంతి లభిస్తుంది. ఈ రాశివారు కుటుంబంతో మంచి సమయం గడుపుతారు. ఉద్యోగాల్లో సంతృప్తికర వాతావరణం ఉంటుంది. ఆరోగ్యం బాగుంటుంది. యువకులు తల్లితో సమయం గడపడం వల్ల సంతోషంగా ఉంటారు. వ్యాపారాల్లో సమస్యలు తొలగుతాయి. 

34
కన్య రాశి

కుంభ రాశిలో చంద్రుని సంచారం కన్య రాశివారికి లాభాలను తెస్తుంది. ఎప్పటినుంచో నిలిచిపోయిన డబ్బులు చేతికి వస్తాయి. ఆగిపోయిన పనులు పూర్తవుతాయి. కష్టానికి తగ్గ ప్రతిఫలం ఉంటుంది. విదేశీ కంపెనీల్లో లేదా విదేశాల్లో పనిచేసే వారికి ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఇల్లు కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి. ఇంట్లో ఉన్న కొన్ని సమస్యలు.. బయటి వ్యక్తుల జోక్యం వల్ల తీరిపోతాయి. 

44
కుంభ రాశి

చంద్రుడి సంచారం కుంభ రాశివారికి అదృష్టాన్ని మోసుకువస్తుంది. కొత్త పని ప్రారంభించడానికి రాబోయే కొన్ని రోజులు శుభప్రదంగా ఉంటాయి. ఉద్యోగులకు మంచి కంపెనీలో అవకాశం రావచ్చు. పెళ్లైన వారు.. వారి తోబుట్టువులతో సంతోషంగా గడుపుతారు. వ్యాపారాలు ఆశించిన స్థాయిలో రాణిస్తాయి. ఇంటా బయట సంతోషకర వాతావరణం ఉంటుంది. మనశ్శాంతి లభిస్తుంది. ఒంటరి వ్యక్తులు పాత స్నేహితులతో మాట్లాడటం ద్వారా కొన్ని విషయాలు గుర్తు చేసుకుంటారు.

Read more Photos on
click me!

Recommended Stories