Birth Date: ఈ మూడు తేదీల్లో పుట్టినవారు ప్రేమలో పదే పదే మోసపోతారు!

Published : Aug 10, 2025, 01:44 PM IST

సంఖ్యాశాస్త్రం ప్రకారం కొన్ని నిర్దిష్ట తేదీల్లో పుట్టిన వ్యక్తులు ప్రేమలో మోసపోతారట. చాలా ఆలస్యంగా వీరికి నిజమైన ప్రేమ దక్కుతుందట. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ప్రేమలో పదే పదే మోసపోతారో.. ఓసారి తెలుసుకోండి.

PREV
15
Numerology and Love Failure

ఒక వ్యక్తి పుట్టిన తేదీ ఆధారంగా వారి వ్యక్తిత్వం, భవిష్యత్తు, వ్యక్తిగత, వృత్తి జీవితం గురించి తెలుసుకోవచ్చు. జ్యోతిష్య శాస్త్రంలో ప్రతి ఒక్కరికి ఒక రాశి దానికి సంబంధించిన గ్రహం ఎలా ఉంటుందో.. పుట్టిన తేదీకి కూడా మూల సంఖ్యలు అలాగే ఉంటాయి. దానికి సంబంధించిన గ్రహం ఉంటుంది. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ప్రేమలో మోసపోతారో ఇక్కడ తెలుసుకుందాం.

25
మూల సంఖ్య 5

సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 5, 14, 23 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 5. ఈ సంఖ్యకు అధిపతి బుధ గ్రహం. ఈ తేదీల్లో పుట్టినవారు బుధుని ప్రభావంతో చాలా తెలివిగా, రొమాంటిక్ గా ఉంటారు. వ్యాపారంలో రాణిస్తారు. కానీ కొన్నిసార్లు వీరికి అదృష్టం కలిసిరాదు. ముఖ్యంగా వీరు ప్రేమలో మోసపోతారు.  

35
5 వ తేదీన పుట్టినవారు..

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలో అయినా 5వ తేదీన పుట్టినవారు కష్టజీవులు. ఏ పని చేసినా అందులో విజయం సాధిస్తారు. సమాజంలో గౌరవ, మర్యాదలు పొందుతారు. కానీ ప్రేమ విషయంలో వీరు వైఫల్యాన్ని ఎదుర్కొంటారు.

45
14 వ తేదీన పుట్టినవారు..

సంఖ్యాశాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 14వ తేదీన పుట్టినవారు వ్యాపారంలో విజయం సాధిస్తారు. వారి కలలన్నీ నెరవేరుతాయి. కానీ ప్రేమ విషయానికి వస్తే, వారు మోసపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. చాలా ఆలస్యంగా వీరు నిజమైన ప్రేమను పొందుతారు. 

55
23 వ తేదీన పుట్టినవారు..

సంఖ్యాశాస్త్రం ప్రకారం, ఏ నెలలోనైనా 23వ తేదీన పుట్టినవారు ఆకర్షణీయమైన వ్యక్తిత్వాన్ని కలిగి ఉంటారు. ఎంత కష్టమైన పనులనైనా సులభంగా పూర్తి చేస్తారు. కానీ నిజమైన ప్రేమ కోసం వీరు వెతుకుతూనే ఉంటారు. అది వారికి దొరకదు.

Read more Photos on
click me!

Recommended Stories