సెప్టెంబర్ 7 నుంచి ఈ రాశుల వారికి కష్ట కాలం.. పరిహారం ఏంటంటే.?

Published : Aug 30, 2025, 09:21 AM IST

సెప్టెంబర్ 7న ఆదివారం రాత్రి అరుదైన రాహు గ్రస్థ సంపూర్ణ చంద్రగ్రహణం జరుగనుంది. ఇది కుంభరాశిలో ఏర్పడుతుంది. దీని కారణంగా కొన్ని రాశులపై ప్రభావం పడుతుందని జ్యోతిష్య నిపుణులు చెబుతున్నారు. ఇంతకీ ఆ రాశులేంటో ఇప్పుడు తెలుసుకుందాం. 

PREV
15
గ్రహణ సమయం, ప్రభావం

* గ్రహణం రాత్రి 9:50 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1:26 గంటలకు ముగుస్తుంది.

* మొత్తం వ్యవధి దాదాపు 3 గంటల 30 నిమిషాలు.

* జ్యోతిష్య గణనల ప్రకారం గ్రహణం ప్రభావం ఆరు నెలల పాటు ఉంటుంది.

DID YOU KNOW ?
గ్రహణ సమయం
గ్రహణం సెప్టెంబర్ 7న రాత్రి 9:50 గంటలకు ప్రారంభమై అర్ధరాత్రి 1:26 గంటలకు ముగుస్తుంది.
25
ఈ రాశుల వారు జాగ్ర‌త్త

కుంభరాశి – ఆరోగ్య సమస్యలు ఎక్కువగా తలెత్తే అవకాశం. నిద్ర, ఆహారం సమయానికి పాటించాలి. మానసిక ఆందోళన తగ్గించుకోవాలి.

వృశ్చికరాశి – నాల్గవ స్థానంలో గ్రహణం కావడంతో విద్యలో ఆటంకాలు, ఆస్తి లావాదేవీల్లో సమస్యలు తలెత్తవచ్చు.

కర్కాటకరాశి – అష్టమస్థానంలో గ్రహణం ఏర్పడటం వ‌ల్ల‌ వాహన ప్రమాదాలు, కుటుంబంలో ఉద్రిక్తతలు వచ్చే అవకాశం ఉంది. ఆహార అలవాట్లలో క్రమశిక్షణ అవసరం.

మీనరాశి – అజ్ఞాత శత్రువులు, అనవసర ఖర్చులు పెరుగుతాయి. వీరు అధిక జాగ్రత్త అవసరం.

35
గ్రహణ సమయంలో చేయాల్సినవి

* గ్రహణం ప్రారంభమయ్యే ముందు స్నానం చేసి ఇష్టదేవుని ప్రార్థించాలి.

* దుర్గా స్తోత్రాలు, శివ స్తోత్రాలు వినడం మంచిది.

* స్తోత్రాలు చదవలేని వారు “దుం దుర్గాయై నమః”, “ఓం చంద్రశేఖరాయ నమః”, “ఓం నమో వెంకటేశాయః” మంత్రాలను జపించడం శ్రేయస్కరం.

* అర్ధరాత్రి స్నానం అవసరం లేదు, మరుసటి రోజు ఉదయం తలస్నానం చేసి శివాలయానికి వెళ్లి అభిషేకాలు చేయాలి.

45
చేయాల్సిన దానాలు

గ్రహణం మరుసటి రోజు (సెప్టెంబర్ 8, సోమవారం) శివాలయంలో వెండి, రాగి లేదా ఇత్తడి నాగపడిగ, చంద్రబింబం వంటివి దానాలు చేయడం శుభప్రదం. మినుములు (రాహువు ప్రీతికి), బియ్యం (చంద్రుడు ప్రీతికి), తెల్లని వస్త్రాలు, నెయ్యి వంటి వాటిని దానం చేయ‌డం మంచిది.

55
ఈ రాశుల వారికి క‌లిసొస్తుంది

ధనుస్సురాశి – సోదరుల సహకారంతో లాభాలు. భూములు, స్థలాలు, గృహాల లావాదేవీల్లో మంచి ఫలితాలు ల‌భిస్తాయి.

కన్యారాశి – ఆరు నెలలు ఆరోగ్య సమస్యలు ఉండవు. అప్పులు తీర్చుకోవచ్చు. శత్రు బలహీనత తగ్గుతుంది.

వృషభరాశి – కెరీర్, ఉద్యోగం, వ్యాపారంలో పెద్ద అవకాశాలు. పదోన్నతులు, లాభాలు సాధించే అవకాశం ఉంటుంది.

మేషరాశి – ఆర్థిక స్థిరత్వం, ఆరోగ్య పరంగా మంచి ఫలితాలు. అన్ని రంగాల్లో లాభాలు పొందే అవకాశం ఉంది.

Read more Photos on
click me!

Recommended Stories