స్వప్న శాస్త్రం ప్రకారం ప్రతి కలకు ఒక అర్థం ఉంటుంది. ముఖ్యంగా కొన్ని జంతువులు కలలో కనిపిస్తే అది సాధారణ విషయం కాదని స్వప్న శాస్త్రం చెబుతోంది. అది సంపద, శుభం, కొత్త అవకాశాల ప్రారంభానికి సంకేతం అంటోంది. మరి ఏ జంతువులు కనిపిస్తే మంచిదో ఇక్కడ చూద్దాం.
హిందూ సంస్కృతిలో కలలకు ప్రత్యేక స్థానం ఉంది. స్వప్న శాస్త్రం, జ్యోతిష్య శాస్త్రం ప్రకారం కొన్ని కలలు వస్తే నిజ జీవితంలో శుభం జరుగుతుంది. ముఖ్యంగా కొన్ని జంతువులు కలలో దర్శనమిస్తే అది మహాలక్ష్మీ కటాక్షానికి సంకేతమని స్వప్న శాస్త్రం చెబుతోంది. లక్ష్మీదేవి సంపద, ఐశ్వర్యం, శుభఫలితాల దేవతగా పిలుస్తారు. ఆమె అనుగ్రహం లభించబోతున్నప్పుడు కొన్ని సంకేతాలు ముందుగానే కలల రూపంలో కనిపిస్తాయని పండితులు చెబుతున్నారు. అవేంటో ఇక్కడ చూద్దాం.
26
కలలో ఆవు కనిపిస్తే..
స్వప్న శాస్త్రం ప్రకారం కలలో ఆవు కనిపించడం అత్యంత శుభప్రదం. ఆవును లక్ష్మీ స్వరూపంగా భావిస్తారు. తెల్లని ఆవు ప్రశాంతంగా మీ ముందు నిలబడినట్లు లేదా మీ ఇంటి ఆవరణలో తిరుగుతున్నట్లు కల వస్తే అది ధన లాభానికి, కుటుంబ శ్రేయస్సుకు సూచన. అలాగే ఏనుగు కలలో దర్శనమిస్తే అది రాజయోగానికి సంకేతమని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. ప్రత్యేకంగా ఏనుగు నీటిలో స్నానం చేస్తూ కనిపిస్తే ఆర్థిక ఇబ్బందులు తొలగి ఐశ్వర్యం పెరుగుతుందని సంకేతం.
36
కలలో పాము కనిపిస్తే..
పాము గురించి చాలామందికి భయం ఉన్నప్పటికీ, స్వప్న శాస్త్రం ప్రకారం పాము అన్నిసార్లు అపశకునం కాదు. బంగారు రంగులో లేదా శాంతంగా ఉండే నాగు కలలో కనిపిస్తే అది దాచిన ధనం, అకస్మాత్తుగా లభించే ఆర్థిక అవకాశాలకు సంకేతం. ముఖ్యంగా పాము హాని చేయకుండా వెళ్లిపోతే జీవితంలోని అడ్డంకులు తొలగిపోతున్నాయని అర్థం చేసుకోవచ్చు.
చేపలు కూడా లక్ష్మీ దేవితో సంబంధం కలిగి ఉంటాయని స్వప్నశాస్త్రం చెబుతోంది. నీటిలో ఆరోగ్యంగా ఈదుతున్న చేపలు కనిపిస్తే వ్యాపారంలో లాభాలు, కుటుంబంలో సంతోషం పెరుగుతాయని నమ్మకం. రెండు చేపలు కలిసి కనిపిస్తే దాంపత్య సౌఖ్యం, సంపద వృద్ధి రెండూ కలిసివస్తాయని పండితులు చెబుతున్నారు.
56
గుర్రం కలలో కనిపిస్తే..
గుర్రం కలలో కనిపించడం కూడా విజయానికి సంకేతం. తెల్ల గుర్రంపై స్వారీ చేస్తున్నట్లు కనిపిస్తే అది మీ కృషికి ఫలితం దక్కబోతుందని, ఉద్యోగంలో ప్రమోషన్ లేదా వ్యాపార విస్తరణ జరుగుతుందని సూచన. పక్షులు, ముఖ్యంగా తెల్ల పావురం లేదా హంస కనిపిస్తే అది శాంతి, శుభవార్త, ఆర్థిక పురోగతికి సూచన. పక్షులు ఆకాశంలో ఎగురుతూ మీ వైపు వస్తున్నట్లు కనిపిస్తే కొత్త అవకాశాలు మీ జీవితంలోకి ప్రవేశించనున్నాయని అర్థం.
66
సింహం, పులి కలలో కనిపిస్తే..
సింహం లేదా పులి వంటి శక్తిమంతమైన జంతువులు కలలో కనిపిస్తే మొదట భయంగా అనిపించినా, అవి మీలో దాగి ఉన్న నాయకత్వ గుణాలను సూచిస్తాయని స్వప్న శాస్త్రం చెబుతోంది. ఆ జంతువు మీకు హాని చేయకుండా దూరంగా నిలబడితే అది అధికారం, గౌరవం, ఆర్థిక స్థిరత్వం వచ్చే సూచన. అలాగే నెమలి కనిపించినా శుభం జరుగుతుందని పండితులు చెబుతున్నారు. ముఖ్యంగా నెమలి తన రెక్కలు విప్పి నృత్యం చేస్తున్నట్లు కనిపిస్తే అదృష్ట ద్వారాలు తెరుచుకుంటాయని పండితులు వివరిస్తున్నారు.
జ్యోతిష్య పండితుల ప్రకారం కలల ఫలితాలు వ్యక్తి జన్మకుండలి, దశలు, గోచారాలపై కూడా ఆధారపడి ఉంటాయి. ఒకే కల ప్రతి ఒక్కరికీ ఒకే ఫలితం ఇవ్వకపోవచ్చు. కల వచ్చిన రోజు, తిథి, నక్షత్రం వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని పండితులు సూచిస్తున్నారు.