శని సంచారం అంటేనే అన్ని రాశులవారు భయపడిపోతుంటారు. అయితే ప్రతిసారీ శని సంచారం ప్రభావం చెడుగానే ఉండదు. కొన్ని రాశులవారి మేలు జరిగితే, మరికొన్ని రాశులవారికి చెడు ఫలితాలు రావచ్చు. శని ప్రస్తుతం మీనరాశిలో ఉన్నాడు. అక్టోబర్ 3వ తేదీ రాత్రి ఉత్తరాభాద్ర నక్షత్రంలోకి ప్రవేశిస్తాడు. దానివల్ల కొన్ని రాశుల వారి జీవితాల్లో సానుకూల మార్పులు చోటుచేసుకుంటాయి. ఆ రాశులేంటో చూద్దామా..