Saturn Transit: శని నక్షత్రమార్పు, మూడు రాశులకు వరమే

Published : Apr 29, 2025, 01:08 PM IST

శని గ్రహం పూర్వభాద్రపద నక్షత్రం నుంచి ఉత్తరభాద్రపద నక్షత్రంలోకి కదిలింది. ఈ మార్పు మూడు రాశులకు ప్రయోజనాలు కలిగించనుంది. మరి, ఆ రాశులేంటో చూద్దాం..  

PREV
16
Saturn Transit: శని నక్షత్రమార్పు, మూడు రాశులకు  వరమే

శని దేవుడు ప్రతి రెండున్నర సంవత్సరాలకు ఒకసారి తన రాశిని మార్చుకుంటూ ఉంటాడు. అలా రాశిని మారినప్పుడు ఆయన జోతిష్యశాస్త్రంలోని 12 రాశులను తాను ఉన్న, చూసే స్థానాలను బట్టి ఆ రాశి భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. అదేవిధంగా శని గ్రహం సంవత్సరానికి ఒకసారి రాశిని మార్చుకుంటూ ఉంటాడు.  రీసెంట్ గా కుంభ రాశి నుంచి శని మీన రాశిలోకి అడుగుపెట్టగా.. పూర్వ భాద్రపద నక్షత్రం నుంచి ఉత్తరాభాద్రపద నక్షత్రంలోకి చేరుకున్నాడు
 

26


ప్రస్తుతం మీన రాశిలో శని దేవుడు ఉన్నారు. ఏప్రిల్ 30న అక్షయ తృతీయ 2025 రానున్న నేపథ్యంలో, దానికి ముందు ఏప్రిల్ 28, 2025న, శని తన స్వంత నక్షత్రమైన ఉత్తరభాద్రపద నక్షత్రంలోకి ప్రవేశించాడు. అలా ప్రవేశించే శని దేవుడు అక్టోబర్ 3 వరకు అదే ఉత్తరభాద్రపద నక్షత్రంలోనే ఉంటారు. ఈ నక్షత్రంలో ఉన్నప్పుడు శని దేవుడు 3 రాశుల వారికి అదృష్ట ఫలితాలను ఇస్తారు. శని దేవుని వల్ల అదృష్ట ఫలితాలను పొందే రాశులలో వృషభం, మిథునం , కుంభ రాశులు ఉన్నాయి. మరి, వారికి కలిగే లాభాలు ఏంటో చూద్దాం..
 

36
telugu astrology

శని నక్షత్ర గమనం వృషభ రాశి ఫలితం:

శని దేవుడు తన స్వంత నక్షత్రమైన ఉత్తరభాద్రపద నక్షత్రంలోకి అడుగుపెట్టడం  వృషభ రాశి వారికి శుభప్రదం. ఉత్తరభాద్రపద నక్షత్రానికి గమనం అయ్యే శని దేవుడు వృషభ రాశి వారికి 11వ ఇంట్లో ఉండి అనేక ప్రయోజనాలను ఇవ్వనున్నారు. ఉద్యోగంలో ఉన్న సమస్యలు తీరతాయి. కొత్త ఉద్యోగం కోసం చూస్తున్నవారికి ఉద్యోగం లభిస్తుంది. పదోన్నతి, జీతం పెరుగుదల కూడా ఆశించవచ్చు. పిల్లల నుండి శుభవార్తలు వస్తాయి. దూర ప్రయాణాలు చేయవచ్చు. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. వ్యాపారం, ఉద్యోగం విస్తరిస్తాయి. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. కొత్త స్నేహితులు ఏర్పడతారు. భార్యాభర్తల మధ్య అనుబంధం పెరుగుతుంది.

46
telugu astrology

శని నక్షత్ర గమనం మిథున రాశి ఫలితం:

ఉత్తరభాద్రపద నక్షత్రానికి గమనం అయ్యే శని దేవుడు మిథున రాశి వారికి 10వ ఇంట్లో ఉండి శుభ ఫలితాలను ఇస్తారు. 10వ ఇంట్లో ఉండటం వల్ల జీవితంలో అపారమైన ఆనందం కలుగుతుంది. ఉద్యోగంలో అద్భుతంగా రాణించి ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ ప్రయత్నాలకు తగిన ఫలితం దక్కుతుంది. విజయాలు వెతుక్కుంటూ వచ్చే శుభకాలం.

56
telugu astrology

శని నక్షత్ర గమనం కుంభ రాశి ఫలితం:

ఉత్తరభాద్రపద నక్షత్రానికి గమనం అయ్యే శని దేవుడు కుంభ రాశి వారికి 2వ ఇంట్లో ఉండటం శుభప్రదం. కుటుంబంలో ఆనందం పెరుగుతుంది. జీవితంలో విజయం వైపు మీ ప్రయాణం ఉంటుంది. కొత్త ఒప్పందాలు కుదురుతాయి. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. ఆదాయం పెరుగుతుంది. వాహనం, భూమి, ఆస్తి కొనుగోలు చేసే ఆలోచన బలపడుతుంది.
 

66

ఉత్తరభాద్రపద నక్షత్రం ప్రత్యేకత ఏమిటి?

ఉత్తరభాద్రపద నక్షత్రాన్ని శని పరిపాలిస్తారు. నక్షత్రాల జాబితాలో ఇది 26వ స్థానంలో ఉంది. జల రాశికి చెందినది. ఈ నక్షత్రం  ప్రత్యేక ఫలితం ఏమిటంటే మానసిక వైద్యులు, వైద్యులు, సన్యాసులు, శాస్త్రవేత్తలు, పరిశోధకులు, స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు ప్రయోజనం పొందుతారు.

Read more Photos on
click me!

Recommended Stories