జ్యోతిష్య శాస్త్రంలో బుధుడిని తెలివి తేటలు, వాక్చాతుర్యం, వ్యాపారం, జ్ఞానానికి కారకుడిగా భావిస్తారు. ఇక శని దేవుడిని కర్మ, ఓర్పు, కఠోర శ్రమ, దీర్ఘకాలిక విజయానికి ప్రతీకగా చెబుతారు. ఈ రెండు గ్రహాలు శుభ స్థానాల్లో సంచరించినప్పుడు, దాని ప్రభావం వ్యక్తుల జీవితంలోని అనేక అంశాలపై కనిపిస్తుంది. ఆగస్టు 17న బుధ, శని గ్రహాల మధ్య 120 డిగ్రీల దూరం ఏర్పడుతుంది. దీనివల్ల రెండు గ్రహాలు ఒకదానికొకటి నవమ-పంచమ దృష్టితో చూసుకుంటాయి. దీన్నే 'నవపంచమ దృష్టి యోగం' అని పిలుస్తారు. ఈ యోగం అత్యంత శుభప్రదమైంది. దీని ప్రభావంతో 5 రాశులవారికి విశేష ఫలితాలు ఉంటాయి. అవేంటో, ఆ రాశులేవో ఇక్కడ తెలుసుకుందాం.