Saturn Mercury Conjunction: 30 ఏళ్ల తర్వాత మీనరాశిలో శని, బుధుల కలయిక.. ఈ 3 రాశులకు గోల్డెన్ టైమ్!

Published : Feb 18, 2026, 01:51 PM IST

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం త్వరలో మీనరాశిలో శని, బుధ గ్రహాల కలయిక జరగనుంది. దాదాపు 30 ఏళ్ల తర్వాత జరగనున్న ఈ అరుదైన కలయిక వల్ల మూడు రాశుల వారికి చాలా మేలు జరుగుతుందని పండితులు చెబుతున్నారు. మరి ఆ రాశులేంటో వారికి ఏయే విషయాల్లో కలిసి వస్తుందో చూద్దాం.

PREV
14
Saturn Mercury Conjunction

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహాలు నిర్ణీత సమయంలో ఒక రాశినుంచి మరొక రాశిలోకి మారుతుంటాయి. దానివల్ల శుభ, అశుభ యోగాలు ఏర్పడుతుంటాయి. వాక్కు, వ్యాపారం, తెలివితేటలకు కారకుడైన బుధుడు త్వరలో రాశి మారనున్నాడు. పండితుల ప్రకారం ఏప్రిల్ 11న బుధుడు మీన రాశిలోకి ప్రవేశించి, ఏప్రిల్ 30 వరకు అక్కడే ఉంటాడు. అప్పటికే మీన రాశిలో ఉన్న శని భగవానుడితో కలిసి అరుదైన యోగం ఏర్పరచనున్నాడు. దానివల్ల 3 రాశులవారికి పట్టిందల్లా బంగారం కానుంది. మరి ఆ రాశులేవో చూసేయండి.

24
వృషభ రాశి

వృషభ రాశి వారికి శని, బుధ సంచారం చాలా శుభప్రదంగా, సానుకూలంగా ఉంటుంది. ఈ సమయంలో మీ ఆదాయంలో భారీ పెరుగుదల చూస్తారు. ఉద్యోగం, వ్యాపారంలో పురోగతికి అవకాశాలు ఉన్నాయి. అధికారుల ఆదరణ పెరుగుతుంది. స్నేహితుల సహకారం, కొత్త పరిచయాల ద్వారా లాభాలు కలిగే అవకాశాలు బలంగా ఉన్నాయి. గతంలో నిలిచిపోయిన డబ్బులు చేతికి అందుతాయి. విద్యార్థులకు అనుకూల ఫలితాలు వస్తాయి.

34
మిథున రాశి

మిథున రాశి వారికి శని, బుధ కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ సమయంలో ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి. ధన ప్రవాహం పెరుగుతుంది. ఉద్యోగాలు మారాలి అనుకునేవారికి ఇది మంచి సమయం. నిరుద్యోగులకు కోరుకున్న ఉద్యోగం దక్కే అవకాశాలు బలంగా ఉన్నాయి. వైవాహిక జీవితం సంతోషంగా సాగుతుంది. ప్రేమ బంధాలు బలపడతాయి. వ్యాపారాలు విస్తరిస్తారు. అన్నదమ్ములతో ఉన్న సమస్యలు తొలగిపోతాయి. 

44
మీన రాశి

జ్యోతిష్య శాస్త్రం ప్రకారం.. మీన రాశి వారికి బుధ, శని గ్రహాల కలయిక అదృష్టాన్ని తీసుకువస్తుంది. ఈ సమయంలో మీరు పెట్టే పెట్టుబడుల నుంచి మంచి లాభాలు పొందుతారు. ఆదాయం కోసం మీకు అనేక అవకాశాలు లభిస్తాయి. మీ ఆర్థిక పరిస్థితి గతం కంటే మెరుగ్గా ఉంటుంది. నిర్ణయాలు తీసుకునే సామర్థ్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతాయి. వ్యాపారంలో బాగా కలిసివస్తుంది. స్నేహితుల నుంచి మంచి మద్ధతు లభిస్తుంది. ప్రభుత్వ సంబంధిత వ్యవహారాల్లో ఆశించిన ఫలితాలు వస్తాయి 

Read more Photos on
click me!

Recommended Stories