Rahu Gamanam: రాహు సంచారంతో ఈ 4 రాశుల వారికి రాజభోగం

Published : Feb 18, 2026, 01:13 PM IST

Rahu Gamanam: జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రాహువు శని రాశి అయిన కుంభరాశిలోకి మే 18న ప్రవేశించనున్నాడు. అక్కడే డిసెంబర్ 4 వరకు ఉంటాడు. ఈ రాహు గమనం వల్ల నాలుగు రాశుల వారికి విపరీత లాభాలు కలుగుతాయి. 

PREV
14
వృషభ రాశి

వృషభ రాశి వారికి రాహు గమనం బాగా కలిసివస్తుంది.  శనికి చెందిన రాశులు అయిన మకరం, కుంభంలో రాహువు ఉండటం వల్ల వృషభ రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. ఈ రాాశి వారు ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. అలాగే కెరీర లో పురోగతి కనిపిస్తుంది.  ఇక పెళ్లికాని వారికి వివాహం జరిగే అవకాశం ఉంది. వ్యాపారంలో డబ్బు సంపాదించడానికి అవకాశాలు కూడా దక్కుతాయి. కేసుల్లో  మీరు విజయం సాధించే అవకాశం ఉంది.

24
మిథున రాశి

మిథున రాశి వారు కొత్త ఉద్యోగం కోసం ప్రయత్నిస్తే ఆ ప్రయత్నాలు సఫలం అవుతాయి. రాసిన  పరీక్షల్లో విజయం సాధించే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగులకు ప్రమోషన్ దక్కే అవకాశం ఉంది. అలాగే ఉద్యోగస్తుల హోదా, పలుకుబడి పెరుగుతాయి. మిథున రాశి వారి ఇంట్లో సంతోషం పెరుగుతుంది. అలాగే ఈ రాశి వారి సంపద, ఆస్తులు పెరుగుతాయి. వీరు కొత్త వాహనం కొనుగోలు చేసే అవకాశం ఉంది. ఈ రాశి వారి కష్టానికి తగిన గుర్తింపు దక్కుతుంది. ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి పొందుతారు.

34
కన్యా రాశి

కన్యా రాశి వారికి రాహువు అన్నీ శుభ ఫలితాలను అందిస్తాడు. ఈ రాశి వారికి తమ పిల్లల నుంచి సంతోషం లభిస్తుంది. పెళ్లికాని వారికి మంచి భాగస్వామి దొరికే అవకాశం ఉంది. ఈ రాశి వారు పలుకుబడి ఉన్న వ్యక్తులను కలిసే అవకాశం ఉంది. ఈ రాశి వారి ఆత్మవిశ్వాసం రెట్టింపు అవుతుంది.

44
మీన రాశి

మీన రాశి వారికి ఏలినాటి శని రెండో దశలో ఉంది. దీనివల్ల వారికి కొంత కష్టాలు ఉంటాయి. కానీ కుంభరాశిలోని రాహువు ప్రవేశించడం వల్ల వీరికి కష్టాల నుంచి ఉపశమనం లభిస్తుంది. వీరు విదేశాలకు వెళ్లే అవకాశాలు ఉన్నాయి. ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపడుతుంది. కష్టాలు ఎదురైనా, మీ లక్ష్యాలను సాధించడంలో విజయం సాధిస్తారు.

Read more Photos on
click me!

Recommended Stories