Saturn Transit: ఏప్రిల్ 17 నుంచి ఈ 4 రాశులకు శని పెట్టబోతున్నా అగ్నిపరీక్ష, ఏం చేయాలి?

Published : Apr 12, 2026, 07:47 PM IST

Saturn Transit: శని  ఉత్తరాభాద్ర నక్షత్ర సంచారం వల్ల ఏప్రిల్ 17 నుంచి 4 రాశుల వారికి ఇబ్బందులు మొదలయ్యే అవకాశం ఉంది. ఆ 4 రాశులు ఏవి? వారు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇక్కడ ఇచ్చాము. కొద్ది రోజులు జాగ్రత్తగా ఉండాల్సిన రాశులేవో తెలుసుకోండి.

PREV
15
మేష రాశి

శని ఆగ్రహానికి గురయ్యేది మొదట మేష రాశి వారే. శని నక్షత్ర సంచారం వల్ల మేష రాశి వారు తీవ్రమైన సమస్యలు ఎదుర్కునే అవకాశం ఉంది. ఉద్యోగం చేస్తున్నవారికి ఆకస్మిక మార్పులు వచ్చే ఛాన్స్ ఎక్కువ. ఇక వ్యాపారం చేసే వారికి ఏ మాత్రం కలిసిరాదు. డబ్బు విషయంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలి. శని ఎన్ని పరీక్షలు పెట్టినా, తెలివిగా ఆలోచించి పనిచేస్తే దాని ప్రభావం నుంచి బయటపడొచ్చు.

25
కర్కాటక రాశి

శని ప్రభావం కర్కాటక రాశి వారిపై ఎక్కువగా ఉంటుంది. వీరు అనేక నష్టాలను ఎదుర్కునే అవకాశం ఉంది. కుటుంబ సంబంధాల్లో అభిప్రాయ భేదాలు వచ్చే అవకాశం ఉంది.  ఆఫీసులో మీరు ఒకటి చెబితే, పై అధికారులు మరొకటి అనుకునే అవకాశం ఉంది. శని వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యే ఛాన్స్ ఉంది. ఏ విషయంలోనూ భావోద్వేగానికి గురికాకుండా జాగ్రత్తగా ఉండాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకుండా, ఆలోచించి వ్యవహరించాలి.

35
తులా రాశి

తులా రాశి వారు కూడా శని ప్రభావంతో ఎంతో ఇబ్బందులు పడతారు. ఈ సమయంలో మీరు ఎంత కష్టపడినా విజయం ఆలస్యంగా వస్తుంది. ఆఫీసులో తోటి ఉద్యోగుల పని కూడా ఈ రాశివారు చేయాల్సి వస్తుంది. మానసిక ఒత్తిడి, నిరాశ కలగవచ్చు. ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతినే అవకాశం ఉంది. కానీ శని దేవుడు ఓపికగా ఉన్నవారికి విజయాన్ని ఇస్తాడు. కాబట్టి కష్టపడి పనిచేస్తే ఫలితం తప్పకుండా ఉంటుంది.

45
మకరం

శని వల్ల ఇబ్బంది పడే మరో రాశి మకర రావి. శని ప్రభావం వల్ల వీరికి కూడా కఠినమైన రోజులు రాబోతున్నాయి. మానసిక ఒత్తిడి పెరిగి ఆరోగ్య సమస్యలు వస్తాయి. దీనివల్ల వైద్య ఖర్చులు విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. కుటుంబంలో ఆకస్మిక ఖర్చులు తలనొప్పిగా మారతాయి. ఆఫీసులో కీలక బాధ్యతలు పెరుగుతాయి. కానీ వాటికి తగిన ఫలితాల కోసం వేచి చూడాల్సి వస్తుంది. డబ్బు లావాదేవీల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగితే శని సవాళ్లను అధిగమించి విజయం సాధించవచ్చు.

55
శని ప్రభావం తగ్గించే పరిహారం

పైన చెప్పిన 4 రాశుల వారు శనివారం రోజు ఆంజనేయ స్వామిని పూజించడం లేదా పేదలకు అన్నదానం చేయడం వల్ల శని ప్రభావం తగ్గుతుంది. 

Read more Photos on
click me!

Recommended Stories