Weekly Horoscope: ఈ వారం 4 రాశులవారికి అదృష్టయోగం.. పట్టిందల్లా బంగారమే!

Published : Apr 12, 2026, 07:00 AM IST

Weekly Horoscope: ఈ వార ఫలాలు 12.4.2026 నుంచి 18.4.2026 వరకు సంబంధించినవి. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల వార ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. 

PREV
113
ఈ వారం రాశి ఫలాలు

ఈ వార ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. ఈ వారం ఏ రాశి వారికి ఎలా ఉందో ఇక్కడ వివరంగా తెలుసుకుందాం.

213
మేష రాశి ఫలాలు

ఈ వారం మేష రాశి వారికి మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కొత్త పనులు ప్రారంభించడానికి మంచి సమయం. ఉద్యోగాలలో ఉన్నతాధికారుల నుంచి ప్రశంసలు లభించే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారాలలో పెట్టుబడులు పెట్టే ముందు కాస్త జాగ్రత్తగా ఆలోచించాలి. ఆదాయం బాగానే ఉన్నప్పటికీ ఖర్చులు కూడా పెరిగే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో చిన్న చిన్న విభేదాలు రావచ్చు. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రేమ విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు భవిష్యత్తుకు ఉపయోగపడతాయి.

313
వృషభ రాశి ఫలాలు

ఈ వారం వృషభ రాశి వారికి స్థిరత్వం, అభివృద్ధి కలిసివస్తాయి. మీరు చేపట్టిన పనులు నెమ్మదిగా అయినా సక్సెస్ దిశగా సాగుతాయి. ఉద్యోగులకు కొత్త బాధ్యతలు రావచ్చు, అవి మీ కెరీర్‌కు ఉపయోగపడతాయి. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశాలు ఉన్నాయి. ఆర్థికంగా లాభాలు కనిపిస్తాయి కానీ.. అనవసర ఖర్చులను తగ్గించడం మంచిది. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం ఉంటుంది. స్నేహితులతో సంతోషంగా గడుపుతారు. దాంపత్య జీవితం బాగుంటుంది. ఈ వారం మీరు చూపించే సహనమే మంచి ఫలితాలను ఇస్తుంది.

413
మిథున రాశి ఫలాలు

మిథున రాశి వారికి ఈ వారం చురుకుదనం పెరుగుతుంది. కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపుతారు. ఉద్యోగంలో మీ ప్రతిభను చూపే అవకాశం వస్తుంది. కమ్యూనికేషన్ స్కిల్స్ వల్ల మీరు ఇతరులను ఆకట్టుకుంటారు. వ్యాపార భాగస్వామ్యాల విషయంలో జాగ్రత్త అవసరం. ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ పెట్టుబడుల్లో జాగ్రత్తగా ఉండాలి. కుటుంబ సభ్యులతో సఖ్యత అవసరం. ప్రేమలో చిన్న అపార్థాలు రావచ్చు.

513
కర్కాటక రాశి ఫలాలు

ఈ వారం కర్కాటక రాశి వారిని భావోద్వేగాలు ఎక్కువగా ప్రభావితం చేస్తాయి. మీరు తీసుకునే నిర్ణయాల్లో ఆలోచన అవసరం. ఉద్యోగంలో పనిభారం పెరుగుతుంది కానీ.. ఇచ్చిన పనిని చక్కగా పూర్చిచేస్తారు. వ్యాపారంలో కొత్త అవకాశాలు వస్తాయి. అయితే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం మంచిది కాదు. ఆర్థికంగా కొంత ఒత్తిడి ఉంటుంది. కుటుంబంలో పెద్దల సలహాలు కలిసివస్తాయి. ఈ వారం మీ సహనానికి పరీక్షలా ఉంటుంది.

613
సింహ రాశి ఫలాలు

సింహ రాశి వారికి ఈ వారం చాలా శుభప్రదంగా ఉంటుంది. మీరు చేపట్టిన పనులు విజయవంతం అవుతాయి. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా గుర్తింపు వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారులు లాభాలు పొందుతారు. ఆర్థికంగా మంచి స్థితి ఉంటుంది. కుటుంబంలో ఆనందం నెలకొంటుంది. నాయకత్వ లక్షణాలు బయటపడతాయి. ఆరోగ్యపరంగా బాగానే ఉంటారు. జీవిత భాగస్వామితో మంచి సమయం గడుపుతారు. ఈ వారం మీకు సక్సెస్‌ను తీసుకువస్తుంది.

713
కన్య రాశి ఫలాలు

కన్య రాశి వారు ఈ వారం కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. మీరు చేసే పనిలో పూర్తి శ్రద్ధ అవసరం. ఉద్యోగంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురుకావచ్చు. కానీ వాటిని తెలివిగా అధిగమిస్తారు. వ్యాపారంలో జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆర్థికంగా మిశ్రమ ఫలితాలు ఉంటాయి. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. జీర్ణ సంబంధ సమస్యలు బాధిస్తాయి. ప్రేమలో సహనం అవసరం. ఈ వారం మీకు పరీక్షల సమయం అయినప్పటికీ శుభ ఫలితాలే ఉంటాయి.

813
తుల రాశి ఫలాలు

ఈ వారం తుల రాశి వారికి సమతుల్యత అవసరం. మీరు తీసుకునే నిర్ణయాల్లో జాగ్రత్తగా ఉండాలి. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆర్థికంగా స్థిరంగా ఉంటారు. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యపరంగా బాగానే ఉంటారు. దాంపత్య జీవితం సంతోషంగా సాగుతుంది. మీరు కాస్త ధైర్యంగా ముందుకు వెళ్తే విజయాలు సాధిస్తారు.

913
వృశ్చిక రాశి ఫలాలు

వృశ్చిక రాశి వారికి ఈ వారం అంతంతమాత్రంగా ఉంటుంది. మీరు చేసే పనిలో పూర్తి అంకితభావం చూపుతారు. ఉద్యోగంలో ఒత్తిడి ఉంటుంది కానీ అధిగమిస్తారు. వ్యాపారంలో లాభాలు సాధ్యమవుతాయి. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. కుటుంబంలో చిన్న సమస్యలు రావచ్చు. ఆరోగ్యపరంగా చిన్నపాటి సమస్యలు ఉంటాయి. ప్రేమలో మీరు నిజాయతీగా ఉంటే సంబంధం మరింత బలపడుతుంది.

1013
ధనుస్సు రాశి ఫలాలు

ఈ వారం ధనుస్సు రాశి వారికి అదృష్టం కలిసి వస్తుంది. మీరు చేసే పనులు సులభంగా పూర్తవుతాయి. ఉద్యోగంలో మంచి గుర్తింపు ఉంటుంది. వ్యాపారంలో లాభాలు ఉంటాయి. ఆర్థికంగా బాగుంటుంది. కుటుంబంలో ఆనందం ఉంటుంది. ఆరోగ్యపరంగా సమస్యలు ఉండవు. ప్రేమలో మంచి అనుభూతులు ఉంటాయి. ఈ వారం మీకు శుభఫలితాలు ఇస్తుంది.

1113
మకర రాశి ఫలాలు

మకర రాశి వారికి ఈ వారం క్రమశిక్షణ చాలా అవసరం. కష్టపడి పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయి. ఉద్యోగంలో అవకాశాలు ఉంటాయి. వ్యాపారంలో స్థిరత్వం ఉంటుంది. ఆర్థికంగా జాగ్రత్త అవసరం. కుటుంబంలో సహకారం ఉంటుంది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు బాధిస్తాయి. ప్రేమలో సహనం అవసరం. ఈ వారం మీకు శ్రమకు తగిన ఫలితం ఇస్తుంది.

1213
కుంభ రాశి ఫలాలు

కుంభ రాశి వారికి ఈ వారం కొత్త ఆలోచనలు వస్తాయి. క్రియేటివ్‌గా ఆలోచిస్తారు. ఉద్యోగంలో మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారంలో కొత్త మార్గాలు కనిపిస్తాయి. ఆర్థికంగా లాభాలు ఉంటాయి. కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఆరోగ్యపరంగా బాగానే ఉంటారు. ప్రేమించినవారితో మంచి సమయం గడుపుతారు.

1313
మీన రాశి ఫలాలు

మీన రాశి వారికి ఈ వారం ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటారు. ఉద్యోగంలో పనులు నెమ్మదిగా సాగుతాయి. వ్యాపారంలో జాగ్రత్త అవసరం. ఆర్థిక పరిస్థితి స్థిరంగా ఉంటుంది. కుటుంబంలో శాంతి నెలకొంటుంది. ఆరోగ్యపరంగా బాగుంటుంది. ప్రేమలో భావోద్వేగాలు పెరుగుతాయి. ఈ వారం మీకు మానసిక ప్రశాంతత ఇస్తుంది.

Read more Photos on
click me!

Recommended Stories