మీన రాశి వారికి ఇది మంచి కాలం కాదు. ప్రస్తుతం రాహువు మీ రాశిలోనే సంచరిస్తున్నాడు. కాబట్టి ఈ గ్రహణ దోషం మీపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతుంది. మీనంలో రాహువు, కన్యారాశిలో కేతువు ఉండటం వల్ల సమస్యలు రావచ్చు. ఈ సమయంలో అనవసరమైన భయం, నిద్రలేమి, భవిష్యత్తుపై ఆందోళన వంటివి పెరిగిపోతాయి.ఆలోచనలు ప్రతికూలంగా మారే అవకాశం ఉంది. ఏప్రిల్ 13 తర్వాత ఉద్యోగం మారడం లేదా కొత్త ఆస్తులు కొనడం వంటి విషయాల్లో బాగా ఆలోచించి నిర్ణయం తీసుకోండి. ఆరోగ్యం విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి.