Published : Aug 07, 2025, 02:15 PM ISTUpdated : Aug 07, 2025, 02:16 PM IST
సంఖ్యా శాస్త్రం ప్రకారం కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారు లెక్కలేనంత డబ్బును సంపాదిస్తారట. చిన్న వయసులోనే ఎన్నో తరాలకు సరిపోయే సంపదను కూడబెడతారట. మరి ఏ తేదీల్లో పుట్టిన వారు ఇంతటి అదృష్టాన్ని కలిగి ఉంటారో ఇక్కడ తెలుసుకుందాం.
సంఖ్యా శాస్త్రం ఆధారంగా వ్యక్తుల భవిష్యత్ ఎలా ఉంటుందో అంచనా వేయచ్చు. కొన్ని ప్రత్యేకమైన తేదీల్లో పుట్టిన వారు చిన్న వయసులోనే అపారమైన డబ్బును సంపాదిస్తారట. వీరు బలమైన సంకల్ప శక్తిని కలిగి ఉంటారట. ఎలాంటి కష్టాన్ని అయినా వీరు ఇష్టంగా ఎదుర్కొంటారట. మరి ఏ తేదీల్లో పుట్టినవారు ఇలాంటి లక్షణాలు కలిగి ఉంటారో ఇక్కడ చూద్దాం.
24
ఏ నెలలో అయినా..
సంఖ్యా శాస్త్రం ప్రకారం ఏ నెలలో అయినా 8, 17, 26 తేదీల్లో పుట్టినవారి మూల సంఖ్య 8 అవుతుంది. ఈ తేదీల్లో పుట్టినవారికి సహనం చాలా ఎక్కువ. వీరు చాలా స్థిరమైన నిర్ణయాలు తీసుకుంటారు. దేనికి భయపడరు. వెనకడుగు వేయరు. ఏదైనా పని అనుకున్నారంటే దాన్ని పూర్తి చేసే వరకు వదిలిపెట్టరు.
34
మూల సంఖ్య ఎనిమిది
సంఖ్యాశాస్త్రం ప్రకారం మూల సంఖ్య 8.. శని గ్రహానికి సంబంధించింది. జ్యోతిష్యంలో శని గ్రహాన్ని.. కర్మలకు అధిపతి, న్యాయ దేవుడిగా భావిస్తారు. సాధారణంగా శనిని నెమ్మదిగా ఫలితాలనిచ్చే గ్రహంగా పరిగణిస్తారు. మూల సంఖ్య 8 కలిగిన వారు కష్టజీవులు కాబట్టి దానికి తగ్గ ఫలితాన్ని కాస్త ఆలస్యంగా పొందుతారు. కానీ ఒక్కసారి గెలుపు మొదలైతే ఇక వెనక్కి తిరిగి చూసుకోరు.
ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా మంచి లక్షణాలు కలిగి ఉంటారు. క్రమశిక్షణ, కష్టపడే తత్వం, స్థిరత్వం వంటి గుణాలు వీరి జీవితంలో సిరి సంపదలను పెంచుతాయి. మూల సంఖ్య 8 కలిగిన వ్యక్తులు 35 ఏళ్ల తర్వాత అద్భుతమైన విజయం సాధిస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు ఎక్కువశాతం వ్యాపారం చేయడానికి ఇష్టపడతారు. సాధారణంగా వీరు కృషి, పట్టుదలతో అపార సంపదను కూడబెడతారు. అది చాలా తరాల వరకు ఉంటుందని సంఖ్యా శాస్త్రం చెబుతోంది.