కొత్త ఏడాది 2027లో వృషభ రాశి వారికి రాహువు వల్ల ఆర్థికంగా చాలా బాగుంటుంది. వీరి ఆదాయం పెరిగే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. గతంలో పెట్టిన పెట్టుబడుల నుంచి లాభాలు అందుకుంటారు. ఇక ఉద్యోగం చేస్తున్న వారికి ఆఫీసులో బాధ్యతలు పెరుగుతాయి. ఈ రాశివారి టాలెంట్, కష్టాన్ని పై అధికారులు గుర్తిస్తారు. ఇక వ్యాపారం చేస్తున్న వారికి కొత్త ప్రాజెక్టులు మంచి ఫలితాలను ఇస్తాయి. కుటుంబంలో సంతోషం, ప్రశాంతత ఉంటాయి. అయితే, డబ్బు ఆశతో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టేటప్పుడు తొందరపడొద్దు.