Rahu transit: కుంభ రాశిలోకి రాహువు.. ఈ 4 రాశులకి గుడ్ టైం స్టార్ట్ అయినట్లే!

నవ గ్రహాల్లో రాహువు, కేతువు నీడ గ్రహాలుగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఈ రెండు గ్రహాల కదలిక రివర్స్ లో ఉంటుంది. ఈ ఏడాది రాహువు త్వరలో తన రాశిని మార్చుకోనున్నాడు. దీనివల్ల 4 రాశుల వారికి కలిసివస్తుందట. పట్టిందల్లా బంగారం అవుతుందట. మరి ఆ రాశులెంటో చూద్దామా.

జ్యోతిష్య శాస్త్ర ప్రకారం నవగ్రహాలు నిర్దిష్ట సమయంలో రాశులు, నక్షత్రులు మారుస్తూ ఉంటాయి. ఈ గ్రహాల మార్పు వల్ల కొన్ని రాశులవారికి మంచి జరిగితే, మరికొన్ని రాశులవారికి చెడు జరిగే అవకాశం ఉంటుంది. మరికొద్ది రోజుల్లో రాహువు తన రాశిని మార్చుకోనున్నాడు. మే 18 న రాహువు కుంభరాశిలోకి ప్రవేశిస్తాడు. జ్యోతిష్యం ప్రకారం, కుంభరాశిలో రాహువు సంచారం కొన్ని రాశుల వారికి శుభప్రదంగా ఉంటుంది. రాహువు రాశి మారడం వల్ల వారు కెరీర్‌లో లాభపడతారు. ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు చూస్తారు. మరి ఇన్ని లాభాలు పొందే రాశులెంటో ఇప్పుడు తెలుసుకుందాం.

మిథున రాశి

రాహువు రాశి మారడం వల్ల మిథున రాశి వారి భవిష్యత్తు మారుతుంది. ఈ సమయంలో వారికి అదృష్టం పెరుగుతుంది. రాహువు అదృష్ట స్థానంలో సంచరించడం వల్ల జీవితంలో కొత్త అవకాశాలు వస్తాయి. కెరీర్‌లో ఎదుగుదల ఉంటుంది. విదేశాలకు వెళ్లే అవకాశం ఉంది. విద్యార్థులు విజయం సాధిస్తారు. ఆర్థికంగా రాహువు సంచారం మిథున రాశి వారికి అనుకూలంగా ఉంటుంది. ఆస్తిలో పెరుగుదల ఉంటుంది. కోర్టుకు సంబంధించిన విషయాలు ఏమైనా ఉంటే విజయవంతంగా పూర్తవుతాయి. 


తులా రాశి

తులా రాశిలో పుట్టిన వారి జీవితంలో రాహువు సంచారం పెద్ద మార్పులు తెస్తుంది. ఈ సంచారం తులా రాశి వారికి చదువు, బంధాలు, పిల్లలకు సంబంధించిన విషయాల్లో మంచి ఫలితాలు ఇస్తుంది. కళలు, సినిమా, రచన, మీడియా రంగాలకు చెందిన వారికి మంచి సమయం. పని చేసే చోట కొత్త విజయాలు వస్తాయి. మీరు ఒక పెద్ద నిర్ణయం తీసుకోవచ్చు. 
 

మకర రాశి

మకర రాశి వారికి ఆర్థికంగా రాహువు సంచారం ముఖ్యం. సంపద ఇంట్లో రాహువు సంచరించడం వల్ల కొత్త ఆదాయ మార్గాలు ఏర్పడతాయి. వ్యాపారంలో మంచి విజయం సాధించవచ్చు. పెట్టుబడుల వల్ల మంచి లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఉద్యోగంలో ప్రమోషన్ లేదా జీతం పెరగవచ్చు. జీవితంలో స్థిరత్వం ఉంటుంది. డబ్బుకు సంబంధించిన నిర్ణయాలు తీసుకోవచ్చు. 
 

మీన రాశి

మీన రాశి వారికి రాహువు సంచారం చాలా శుభప్రదం. రాహువు సంచారం లాభం ఇంట్లో ఉండడం వల్ల వృత్తి, వ్యాపారంలో మంచి విజయం సాధించవచ్చు. రాజకీయ, మీడియా రంగాలకు చెందిన వారికి చాలా లాభం ఉంటుంది. ఆర్థికంగా మంచి సమయం. పలుకుబడి ఉన్న వాళ్లతో సంబంధాలు ఏర్పడతాయి. అది భవిష్యత్తులో ఉపయోగపడుతుంది.

Latest Videos

click me!