జాతకాలు కలవకపోయినా ఇవి కలవాల్సిందే..
జాతకం చూడకుండా పెళ్లి చేసుకోవాలంటే మీ జీవితంలోకి వచ్చే వ్యక్తి గురించి కచ్చితంగా కొన్ని విషయాలు తెలుసుకోవాలి.
ఇద్దరి కుటుంబాల వాతావరణం, వారి ఆలోచనా సరళి, జీవన విధానం సమానంగా ఉన్నాయా? అని చూసుకోవాలి. లేకపోతే, వైవాహిక జీవితం సాఫల్యవంతంగా కొనసాగడం కష్టమవుతుంది.సమస్యలు, కష్టాలు వస్తాయి.
జ్ఞానం, ఆలోచనా విధానం, ఆర్థిక విషయాల్లో నిర్ణయాలు తీసుకునే తీరు ఒకేలా ఉన్నాయా? ఒకరు ఆర్థికంగా బాధ్యతగా ఉంటే, మరొకరు నిర్లక్ష్యంగా ఉంటే, అనర్థాలు తప్పవు. ఈ విషయాల్లో ఇద్దరి మధ్య తేడాలు లేకుండా చూసుకోవాలి. ఇద్దరి అభిప్రాయాలు కలిస్తేనే పెళ్లికి సిద్ధం కావాలి.
భావోద్వేగాలను ఒకరినొకరు అర్థం చేసుకోగలరా? కొందరు ప్రేమ వివాహం చేసుకున్నా, కొద్ది కాలంలోనే విడిపోతుంటారు. ఇది వారి మానసిక అనుకూలత లేకపోవడమే కారణం.
కొంతమంది సహజంగా కోపంగా ఉంటారు, మరికొందరు శాంతస్వభావులుగా ఉంటారు. కానీ నిజమైన వ్యక్తిత్వం వాటిని మించినది. ఒకరి వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.ఒకరినొకరు అర్థం చేసుకుంటే దాంపత్య జీవితంలో సమస్యలు రాకుండా ఉంటాయి.
ఆరోగ్యపరంగా జీవనశైలి ఎలా ఉంది? దీర్ఘకాలిక అనారోగ్యం లేదా ఇతర ఆరోగ్య సమస్యలు ఉన్నాయా? ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకోవాలి.
ఈ ఐదు అనుకూలతలు ఉన్నట్లయితే, జాతకం చూడకుండానే మీరు వివాహ నిర్ణయం తీసుకోవచ్చు. అయితే, కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో జాతక పరిశీలన ఇంకా అవసరమే.