Today Rasi Phalalu: ఈ రాశుల వారికి రియల్ ఎస్టేట్ లో లాభాలే లాభాలు..!

ఈ రోజు రాశి ఫలాలు పంచాంగకర్త ఫణికుమార్ అందిస్తున్నారు. మేష, వృషభ, మిథున, కర్కాటక, సింహ, కన్య, తుల, వృశ్ఛిక, ధనుస్సు, మకర, కుంభ, మీన రాశుల దిన ఫలాలు ఇక్కడ తెలుసుకోండి. ఈ దిన ఫలాలు 04.04.2025 శుక్రవారానికి సంబంధించినవి.

మేష రాశి ఫలాలు

కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారు. నిరుద్యోగులకు అనుకూలం. వృత్తి, ఉద్యోగాల్లో అధికారుల ఆదరణ పెరుగుతుంది. ఇంటా బయట అనుకూలం. మిత్రులతో సంతోషంగా గడుపుతారు. జీవిత భాగస్వామి నుంచి డబ్బు సహాయం అందుతుంది.

వృషభ రాశి ఫలాలు

కీర్తి, ప్రతిష్టలు పెరుగుతాయి. సేవా కార్యక్రమాలకు డబ్బులు ఖర్చు చేస్తారు. ధన ప్రాప్తి కలుగుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనారోగ్య సమస్యల నుంచి ఉపశమనం దక్కుతుంది. వృత్తి, ఉద్యోగాల్లో అనుకూలం. వ్యాపారాలు లాభదాయకం.


మిథున రాశి ఫలాలు

చేపట్టిన పనుల్లో ఆటంకాలు వస్తాయి. వృత్తి, వ్యాపారాలు అంతంత మాత్రమే. పిల్లల చదువుపై దృష్టి పెట్టడం మంచిది. ముఖ్యమైన విషయాల్లో బద్దకించడం మంచిది కాదు. కుటుంబంలో కొందరి  ప్రవర్తన మానసికంగా బాధిస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు నిరాశ కలిగిస్తాయి.

కర్కాటక రాశి ఫలాలు

నూతన రుణ ప్రయత్నాలు చేస్తారు. చేపట్టిన కార్యక్రమాలు మధ్యలో ఆగిపోతాయి. దూర ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో జాగ్రత్త అవసరం.  వృత్తి, వ్యాపారాల్లో ప్రభుత్వ అధికారుల నుంచి సమస్యలు వస్తాయి. ఉద్యోగులకు శ్రమ పెరుగుతుంది.

సింహ రాశి ఫలాలు

దైవ కార్యక్రమాలపై ఆసక్తి పెరుగుతుంది. సోదరులతో  స్థిరాస్తి వివాదాలు పరిష్కారం దిశగా సాగుతాయి. ఆదాయం ఆశించిన విధంగా ఉంటుంది. సన్నిహితుల నుంచి శుభకార్యాలకు ఆహ్వానాలు అందుతాయి. వాహనయోగం ఉంది. ఉద్యోగులకు మంచి అవకాశాలు వస్తాయి. వ్యాపారాలు లాభదాయకం.

కన్య రాశి ఫలాలు

చేపట్టిన పనులు మందకొడిగా సాగుతాయి. అనారోగ్య సమస్యలు వస్తాయి. సోదరులతో  కొన్ని విషయాల్లో మాటపట్టింపులు ఉంటాయి. ఆర్థికంగా ఒడిదుడుకులు తప్పవు. వ్యాపారులకు కలిసిరాదు. వృత్తి, ఉద్యోగాల్లో అధికారులతో సమస్యలు తప్పవు. సేవా కార్యక్రమాల్లో విశేషంగా పాల్గొంటారు.

తుల రాశి ఫలాలు

ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు. చిన్ననాటి  మిత్రుల నుంచి డబ్బు సహయం అందుతుంది. కొత్త కార్యక్రమాలు ప్రారంభించి సకాలంలో పూర్తి చేస్తారు. రియల్ ఎస్టేట్ లో లాభాలు అందుకుంటారు. కొత్త వ్యాపారాలకు పెట్టుబడులు అందుతాయి. వృత్తి, ఉద్యోగాల్లో బాగుంటుంది.

వృశ్చిక రాశి ఫలాలు

వృత్తి, వ్యాపారాల్లో గందరగోళంగా ఉంటుంది. ఉద్యోగంలో అధికారుల  సమన్వయ లోపం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ప్రయాణాలు వాయిదా వేయడం మంచిది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వృథా ఖర్చులు పెరుగుతాయి. ముఖ్యమైన పనుల్లో తొందరపాటు మంచిది కాదు.

ధనస్సు రాశి ఫలాలు

కుటుంబ సభ్యులతో గొడవలు పరిష్కారం అవుతాయి. ఆధ్యాత్మిక విషయాలపై దృష్టి పెడతారు. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తిగా ఉంటాయి. కొత్త వ్యాపారాల విస్తరణకు అడ్డంకులు తొలగిపోతాయి. వృత్తి, ఉద్యోగాల్లో శ్రమకు తగ్గ గుర్తింపు వస్తుంది. నిరుద్యోగ ప్రయత్నాలు కలిసివస్తాయి. విలువైన వస్తువులు కొంటారు.

మకర రాశి ఫలాలు

వాహనయోగం ఉంది. వ్యాపారాలు పుంజుకుంటాయి. అన్ని  వైపుల నుంచి ఆదాయం వస్తుంది. ప్రముఖుల నుంచి ప్రశంసలు అందుకుంటారు. వృత్తి, ఉద్యోగాల్లో శుభవార్తలు వింటారు. ఉద్యోగులకు అనుకూలం. నిరుద్యోగ ప్రయత్నాలు ఫలిస్తాయి.

కుంభ రాశి ఫలాలు

దూరపు బంధువుల నుంచి ఆశ్చర్యకర విషయాలు వింటారు. వృత్తి, వ్యాపారాల్లో శ్రమతో కానీ పనులు పూర్తి కావు. ఉద్యోగులకు బాధ్యతలు పెరుగుతాయి. చేపట్టిన పనుల్లో అవరోధాలు ఉన్నప్పటికీ నిదానంగా పూర్తవుతాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

మీన రాశి ఫలాలు

కుటుంబ సభ్యుల ఆరోగ్యం విషయంలో అప్రమత్తత అవసరం. ఇంటి నిర్మాణ పనుల్లో అవరోధాలు వస్తాయి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. వ్యాపారంలో గందరగోళ వాతావరణం ఉంటుంది. ఉద్యోగాల్లో ట్రాన్స్ ఫర్ సూచనలు ఉన్నాయి. కొత్త అప్పులు చేయడం మంచిది కాదు.

Latest Videos

click me!