Birth Date: ఈ తేదీల్లో పుట్టిన వారికి సర్కార్ జాబ్ ఛాన్స్ ఎక్కువ, కీర్తి ప్రతిష్ఠలు పొందుతారు

Published : Mar 01, 2026, 12:43 PM IST

 Birth Date:న్యూమరాలజీ ప్రకారం, కొన్ని తేదీల్లో పుట్టినవారికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. మరి, అలాంటి తేదీలేంటో ఓసారి చూద్దాం... 

PREV
14
నెంబర్ 1..

ఏ నెలలో అయినా 1, 10, 19, 28 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 1 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారిపై సూర్యుడి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ తేదీల్లో పుట్టినవారికి ఆధిపత్య ధోరణి చాలా ఎక్కువ. అయితే.. వీలైనంత వరకు ప్రశాంతంగా ఉండానికి ఇష్టపడతారు. వీరిలో నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు ప్రయత్నిస్తే.. ప్రభుత్వ ఉద్యోగం పొందే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటాయి. సమాజంలో మంచి స్థాయికి కూడా వెళతారు.

24
నెంబర్ 3..

ఏ నెలలో అయినా 3, 12, 21, 30 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 3 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారికి చిన్నతనం నుంచే నాయకత్వ లక్షణాలు చాలా ఎక్కువగా ఉంటాయి. వీరు విద్యా రంగంలో బాగా రాణించగలరు. వీరు ప్రభుత్వ ఉద్యోగానికి ప్రయత్నిస్తే.. కోరుకున్న ఉద్యోగం వచ్చే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. అంతేకాదు.. వీరు ఉన్నత స్థాయికి కూడా చేరుకోగలరు.

34
నెంబర్ 4..

ఏ నెలలో అయినా 4, 13, 22, 31 తేదీల్లో పుట్టినవారంతా నెంబర్ 4 కి చెందినవారే. ఈ తేదీల్లో పుట్టిన వారంతా ఏ పని చేసినా పర్ఫెక్ట్ గా చేస్తారు. పనిలో గొప్ప నైపుణ్యం కలిగి ఉంటారు. ప్రభుత్వ ఉద్యోగంలో స్థిరపడే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. వీరికి నాయకత్వ లక్షణాలు కూడా చాలా ఎక్కువ. సమాజంలో కీర్తి, ప్రతిష్ఠలు కూడా పొందుతారు.

44
నెంబర్ 9..

ఏ నెలలో అయినా 9, 18, 27 తేదీల్లో పుట్టిన వారంతా నెంబర్ 9 కిందకు వస్తారు. ఈ తేదీల్లో పుట్టిన వారు చాలా ధైర్యవంతులు. కష్టపడి పని చేస్తారు. పెట్టుకున్న లక్ష్యాన్ని చేరుకునేంత వరకు వదిలిపెట్టరు. పట్టుదల చాలా ఎక్కువ. వీరికి ప్రభుత్వ ఉద్యోగం వచ్చే అవకాశం చాలా ఎక్కువ.

Read more Photos on
click me!

Recommended Stories